తీర్చుకుంటున్న వన్యప్రాణులు
జలకాలాటలో దుప్పి
నీటితో నిండిన ఘనిషెట్టి కుంట
నీరు తాగుతున్న నీలుగాయిలు
నీళ్లు తాగుతున్న అడవి దున్నలు
జన్నారం: ఇటీవల కురిసిన వర్షాలకు అడవిలో ఏర్పాటు చేసిన కుంటలు జలకళ సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా సోమవారం డివిజనల్ ఫారెస్ట్ అధికారి రామ్మోహన్ కెమెరాకు చిక్కిన కుంటలు, వన్యప్రాణుల ఫొటోలను విడుదల చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ వర్షపు నీరు వృథాగా పోకుండా, వన్యప్రాణుల దాహం తీర్చడానికి, భూగర్భ జలాలు పెంపొందించేందుకు జన్నారం అటవీ డివిజన్‌లో 187 నీటి కుంటలు తవ్వామన్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కుంటలు నిండడంతో వన్యప్రాణులు సులభంగా దాహం తీర్చుకుంటున్నట్లు తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తుగా చర్యలు ప్రారంభించామని పేర్కొన్నారు.


