అథ్లెటిక్స్‌ పోటీల్లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌ పోటీల్లో ప్రతిభ

Aug 28 2026 11:47 PM | Updated on Aug 28 2026 11:47 PM

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): మంచిర్యాల డివిజన్‌ పరిధిలోని ముల్కల్లలోగల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశా ల విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ సౌత్‌జోన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో రాణించారు. 26, 27 తేదీల్లో హన్మకొండలో నిర్వహించిన పోటీల్లో అండర్‌–16 విభాగం హైజంప్‌లో ఆత్మకూరి నీరజ్‌ కాంస్య పతకం సాధించాడు. టి.ప్రణయ్‌కుమార్‌, ఎ.యశ్వంత్‌ కూడా పోటీల్లో ప్రతిభ కనబరిచి గుర్తింపు తెచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ నాగేశ్‌కుమార్‌, జూనియర్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ రమేశ్‌, పేరెంట్స్‌ కమిటీ సభ్యులు జగదీశ్‌, మొండయ్య, పీడీ శ్రీకాంత్‌ విద్యార్థులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement