బీకాం తృతీయ సంవత్సరం విద్యార్థిని ఎన్.అశ్విత బ్యాడ్మింటన్‌లో రాణిస్తోంది. ఉమ్మడి జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయిలో నిర్వహించిన ర్యాకింగ్ టోర్నమెంట్లలో ప్రతిభ చాటింది. కాకతీయ విశ్వవిద్యాలయ స్థాయిలో వరుసగా మూడేళ్ల పాటు ఎంపిక కాగా రెండుసార్లు బ్యాండ్మిటన్ జట్టుకు సారధిగా నిలిచింది. 2024–25లో కాకతీయ యూనివర్సిటీ నుంచి సౌత్‌జోన్‌కు ఎంపికై ంది. కర్ణాటక యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీ తరఫున పోటీల్లో పాల్గొంది. 2025–26లో సౌత్‌జోన్ కెప్టెన్‌గా ఎంపికై ంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ అకాడమీలో చేరి మెళకువలు నేర్చుకుంటున్న అశ్విత క్రీడల్లో కోచ్‌గా రాణించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.


