సాఫ్ట్‌బాల్‌లో డేనియల్‌ ఆల్‌రౌండర్‌ | - | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌బాల్‌లో డేనియల్‌ ఆల్‌రౌండర్‌

Aug 28 2026 11:47 PM | Updated on Aug 28 2026 11:47 PM

సాఫ్ట్‌బాల్‌లో ప్రతిభ కనబరుస్తూ వరుస విజయాలు సాధిస్తున్నాడు బెల్లంపల్లికి చెందిన డేనియల్‌. స్థానిక మిమ్స్‌ డిగ్రీ కళాశాలలో లైఫ్‌ సైన్సెస్‌ విభాగంలో ఫైనలియర్‌ చదువుతూ సౌత్‌జోన్‌ పోటీల్లో యూనివర్సిటీ స్థాయి, రాష్ట్రం తరఫున పాల్గొని కీర్తి, ప్రతిష్టలు తెచ్చాడు. 2024–25లో బెంగళూర్‌ యూనివర్సిటీలో నిర్వహించిన సౌత్‌జోన్‌ పోటీల్లో కాకతీయ యూనివర్సిటీ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2025–26లో మహారాష్ట్ర యూనివర్సిటీలో జరిగిన సౌత్‌జోన్‌ పోటీల్లో కాకతీయ యూనివర్సిటీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తెలంగాణ సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ మీట్‌లో రాష్ట్రం తరఫున పాల్గొని ఆల్‌రౌండ్‌గా సత్తా చాటాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement