ఏసీసీ నివాసి శృతి డిగ్రీ సెకండియర్ చదువుతూ అథ్లెటిక్స్‌లో రాణిస్తోంది. 2025–26లో కాకతీయ యూనివర్సిటీ స్థాయిలో జరిగిన 200మీటర్ల రన్నింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం గెలుచుకుంది. 34వ సౌత్‌జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ (2023), 38వ నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ కోయంబత్తూర్ (2023), 18వ ఎన్‌ఐడీజేఏఎం (2023)పాట్నా, 19వ ఎన్‌ఐడీజేఎం (2024) అహ్మదాబాద్, 68వ ఎస్‌జీఎఫ్‌ఐ నేషనల్ (పాట్నా 2024), 69వ ఎస్‌జీఎఫ్‌ఐ నేషనల్ (2025) లక్నోలో సత్తాచాటింది. 85వ ఆల్‌ఇండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ మూడబిద్రి (మంగుళూర్)తో వివిధ స్థాయిల్లో పాల్గొంటూ పతకాలు దక్కించుకుంటోంది.


