నత్తనడకన రైతుల నమోదు | - | Sakshi
Sakshi News home page

నత్తనడకన రైతుల నమోదు

Jul 25 2026 1:53 AM | Updated on Jul 25 2026 1:53 AM

● జిల్లాలో ఏడాదిగా సాగుతున్న ప్రక్రియ ● ఇప్పటివరకు 74శాతమే పూర్తి

దండేపల్లి: జిల్లాలో ఫార్మర్‌ రిజిస్ట్రి(రైతు నమోదు) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు 74శాతం మాత్రమే పూర్తయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం కిసాన్‌, రైతుభరోసా, బోనస్‌, రాయితీ పరికరాలు, ఎరువులు, పంటల బీమా, బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. రైతులకు అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు. కొందరు రైతులకు అవగాహన లేకపోవడం, మరికొందరు ఇతర ప్రాంతాల్లో ఉండడం వంటి కారణాలతో ఫార్మర్‌ రిజిస్ట్రి నిదానంగా సాగుతోంది.

సాగుభూమి ఉన్న ప్రతీ రైతుకు..

రైతు నమోదు ప్రక్రియ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏడాది కొనసాగుతోంది. ఏఈవోలు రైతువేదికలతోపాటు వ్యవసాయ కార్యాలయాల్లో, కొన్ని చోట్ల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉండి రైతు నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. సాగుభూమి ఉన్న ప్రతీ రైతుకు 11అంకెల రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య రూపొందిస్తారు. ఈ ఐడీలో ఆధార్‌, ఫోన్‌నంబర్లు, రైతు పేరు, పట్టాదారు పాస్‌పుస్తకం వివరాలు, పొలం సర్వే నంబర్లు, సాగు వివరాలు, భూమి రకం, రైతులు పొందే రాయితీ, రుణాలు, పంటల బీమా వివరాలు పొందుపరుస్తారు. ఈ ప్రక్రియ మీ సేవ కేంద్రాల్లో కూడా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

తప్పనిసరిగా చేసుకోవాలి..

ఫార్మర్‌ రిజిస్ట్రి ఇప్పటికీ చేయించుకోవాని వారుంటే తప్పనిసరిగా చేసుకోవాలి. వ్యవసాయ విస్తరణ అధికారుల వద్దకు వెళ్లి చేయించుకోవాలి. లేదంటే మీసేవా కేంద్రాల్లోనూ చేసుకోవచ్చు. ఫార్మర్‌ రిజిస్ట్రి చేయించుకుంటే భవిష్యత్‌లో మంచి ఉపయోగం ఉంటుంది.

– సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారి

జిల్లాలోని మండలాల

వారీగా రిజిస్ట్రి వివరాలు

మండలం రైతులు పూర్తయిన చేయించు

వారు కోనివారు

దండేపల్లి 17,439 14,536 2,903

లక్సెట్టిపేట 14,325 11,563 2,762

జన్నారం 15,544 12,501 3,043

భీమిని 8,081 6,351 1,730

మంచిర్యాల 1,096 847 249

కన్నెపల్లి 8,958 6,887 2,071

కాసిపేట 5,710 4,345 1,365

నెన్నెల 9,192 6,753 2,439

హాజీపూర్‌ 9,975 7,248 2,727

బెల్లంపల్లి 6,212 4,505 1,707

కోటపల్లి 13,375 9,583 3,792

భీమారం 5,691 4,033 1,658

చెన్నూర్‌ 1,6315 11,551 4,764

తాండూర్‌ 8,282 5,855 2,427

మందమర్రి 6,318 4,318 2,000

వేమనపల్లి 7,301 4,955 2,346

జైపూర్‌ 16,693 10,627 6,066

మొత్తం 1,70,507 1,26,458 44,049

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement