పాతమంచిర్యాల: ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఉద్యమాలు చేస్తూ యువత లేవనెత్తిన న్యాయమైన డిమాండ్లను కేంద్రం ఆమోదించాలని పౌరసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఢిల్లీ లోని యువత ఉద్యమానికి మద్దతుగా సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. 22 మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్రేంద్ర ప్రధాన్ తక్షణం పదవి నుంచి వైదొలగా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరస్పందన వేదిక కన్వీనర్ క్యాతం రవికుమార్, టీజేఎఫ్ నాయకులు జైపాల్‌సింగ్, సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రంగు రాజేశం, జై భారత్ రాష్ట్ర నాయకులు జీవన్ జోయల్, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బింగి సుధాకర్, అరుణోదయ సమాఖ్య జిల్లా కార్యదర్శి అడెపు సమ్మయ్య, బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కనుకుట్ల మల్లయ్య, కేవీపీఎస్ జిల్లా జిల్లా కార్యదర్శిఽ డి.మోహన్, పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ, తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు గంజి రాజన్న తదితరులు పాల్గొన్నారు.


