తాండూర్: పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి అర్జీదారులతో స్నేహపూర్వకంగా మసులుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. బుధవారం ఆయన తాండూర్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పరిసరాలు, క్రైం రికార్డులు పరిశీలించి నేర వివరాలు, కేసుల దర్యాప్తు పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. డీసీపీ మాట్లాడుతూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని తెలిపారు. సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకుని నేరాలను నియంత్రించాలని సూచించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత, సైబర్ నేరాలపై అప్రమత్తత, మత్తు పదార్థాల నిర్మూలన, రహదారి భద్రతపై ప్రజలకు నిత్యం అవగాహన కల్పించాలని అన్నారు. రాత్రి పెట్రోలింగ్ విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదని తెలిపారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, తాండూర్ సీఐ దేవయ్య, ఎస్సై ప్రసాద్‌రావు పాల్గొన్నారు.


