మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డీటీసీ రవీందర్‌కుమార్ బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌లపై ఆరా తీశారు. వార్షిక తనిఖీల లక్ష్యాన్ని చేరుకుని ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచాలని అన్నారు. ఓవర్ లోడ్ వాహనాలపై చర్యలు తీసుకునేలా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. కాగా ఉమ్మడి జిల్లాలో వార్షిక తనిఖీలతోపాటు ప్రభుత్వ వార్షిక లక్ష్యాన్ని చేరుకోవడంలో ఉమ్మడి జిల్లాలోనే మంచిర్యాల జిల్లా ముందంజలో ఉందని అభినందించారు. డీటీసీ గోపి కృష్ణ, ఎంవీఐలు కోలా రవీందర్, లక్ష్మణ్, మహేష్, శ్రీనివాస్, ఏఎంవీఐలు సురేష్, చంద్రశేఖర్, సూర్యతేజ, సాయి లెనిన్, సిబ్బంది పాల్గొన్నారు.


