బెల్లంపల్లి: సింగరేణి మనుగడకు విభేదాలు పక్కనపెట్టి కార్మిక సంఘాలన్ని ఐక్యం కావాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వెంకటస్వామి అన్నారు. ఈ నెల 17, 18న మెడికల్ బోర్డులో కార్మికులకు జరిగిన అన్యాయానికి నిరసనగా బుధవారం శాంతిఖని గనిపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేనంతగా కార్మికుల శ్రమ శక్తిని దోచుకుంటున్నారని విమర్శించారు. ఇటీవల మెడికల్ బోర్డులో 24 మందిని మాత్రమే మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి మెజార్టీ కార్మికులకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచి ప్రచార కార్యదర్శి మంతెన రమేష్, ఫిట్ సెక్రెటరీ రత్నం ప్రవీణ్, అసిస్టెంట్ సెక్రెటరీ దాడి రమేష్, సీనియర్ నాయకులు రత్నం ఐలయ్య, కార్మికులు పాల్గొన్నారు.


