రామగుండం
భీమగుండం
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని జలపాతాలు వరదతో కనువిందు చేస్తున్నాయి. లింగాపూర్ మండలంలోని సప్తగుండాలైన రామగుండం, లక్ష్మణగుండం, సీతగుండం, భీమగుండం, సవతిగుండం, చిరుతల గుండం, బుగ్గ గుండం జలకళను సంతరించుకున్నాయి. వీటినే మిట్టే జలపాతంగానూ పిలుస్తుంటారు. పూర్వం సీతారాములు, లక్ష్మణుడు వనవాస సమయంలో ఇక్కడ నివసించినట్లు స్థానికులు చెబుతుంటారు. జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.
– లింగాపూర్


