అపూర్వం.. అపురూపం! | - | Sakshi
Sakshi News home page

అపూర్వం.. అపురూపం!

Jul 5 2026 11:22 PM | Updated on Jul 5 2026 11:22 PM

ఖానాపూర్‌ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1991–92 ఎస్సెస్సీ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానికంగా ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించారు. 34 ఏళ్ల తర్వాత ఐదు పదుల వయసులో పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట చేరి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. చిలిపి పనుల జ్ఞాపకాలతో నవ్వుకున్నారు. పన్నెల జనార్ధన్‌ (అమెరికా), న్యాయవాది కామోజి వేణుగోపాల్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్లు అబ్దుల్‌ ఖలీల్‌, కావలి సంతోష్‌, ఆర్యవైశ్య నాయకుడు పడిగెల శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశ, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా ఒకేవేదికపైకి వచ్చి స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేశారు. తమకు చదువులు చెప్పి ఉన్నతికి కారణమైన అప్పటి ఉపాధ్యాయులు దేవన్న, కుమార్‌, సుధాకర్‌, విఠల్‌ను సన్మానించారు. ఆశీర్వాదాలు తీసుకున్నారు. తమతో కలిసి చదివి అకాల మరణం పొందిన స్నేహితులకు నివాళులర్పించారు. – ఖానాపూర్‌

మందమర్రి కార్మెల్‌ స్కూల్‌లో..

మందమర్రి పట్టణంలోని కార్మెల్‌ హైస్కూల్‌లో 1992–93 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్దులు ఆదివారం అపూర్వ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. 33ఏళ్ల క్రితం కలిసి పూర్వ విద్యార్థులు స్కూల్‌ ప్రాంగణానికి చేరుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. క్షేమ సమాచారం తెలుసుకున్నారు. పాఠశాల అంతా కలియ తిరిగారు. అందరూ కలసి సహపంక్షి భోజనం చేశారు. గురువులను సన్మానించారు. – మందమర్రిరూరల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement