మంచిర్యాలటౌన్: ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో అండర్–14, అండర్–16 విభాగాల్లో క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపికై న క్రీడాకారుల జట్టును అసోసియేషన్ కార్యదర్శి కె. ప్రదీప్, కోచ్ పి.ప్రదీప్ ప్రకటించారు.
అండర్–14 విభాగం: మంచిర్యాల నుంచి ఎస్‌డి అహ్మద్, సీహెచ్ శ్రేహాస్, సోహం దాస్, ఎస్‌కె సాహిల్, రేయాన్ష్, పి.వికాస్, మణిదీప్ ఎంపికయ్యారు. బెల్లంపల్లి నుంచి మికెషిత్, ఆర్. రిత్విక్, మెహ్రాన్, రామకృష్ణాపూర్ నుంచి వి.సాయిరితేష్, సాయిదీక్షిత్, శ్రీనియాన్, ఆష్రాఫ్, ఆదిలాబాద్ నుంచి సూర్య, షెయిక్ నూమన్, రాథోడ్ శ్రీ అశ్విత్, బి.శౌర్యవీర్, నిర్మల్ నుంచి జె. కరణ్, కార్తీక్, డి.దీక్షిత్, జైపూర్ నుంచి జి. అఖిలేష్, సోమగూడెం నుంచి గౌతం రక్ష ఎంపికయ్యారు.
అండర్–16 విభాగం: మంచిర్యాల నుంచి బి.అర్జున్, వి.లక్ష్మణ్ సాయి, ఎస్.అర్జున్, ఎం.రేవంత్, పి.వర్శిత్, ఎన్.అశ్విత్‌రెడ్డి, భువన్ తేజ్, రామకృష్ణాపూర్ నుంచి ఎన్.రిత్విక్, ఆదిలాబాద్ నుంచి ఎండీ అద్నాన్, ఎండీ అనాస్, సైఫ్ బిన్ సోహైల్, మీర్జా రుహ్‌బాన్, డి.దినేష్‌రాజ్, డి.మోక్షిత్, డి.రుద్ర, కాగజ్‌నగర్ నుంచి రోహన్ కుమార్, ఎం.త్రిశూల్, నిర్మల్ నుంచి జె.హిమేష్, ఈ. శైలేష్, బి.సాత్విక్, ధనుశ్ ఎంపికయ్యారు.
ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
కోటపల్లి: కోటపల్లి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల, కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. ఆదివారం తెల్లవారుజాము కళాశాల నుంచి బయటకు వెళ్లి రాలేదు. కళాశాల సిబ్బంది బెల్లంపల్లిలోని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీయగా ఫలితం లేకపోవడంతో పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై రాజశేఖర్ కేసు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని కళాశాల భవనం వెనుకవైపు నుంచి బయటకు వెళ్లినట్లు గుర్తించారు.
బాలుడికి విముక్తి
జన్నారం: ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా ఓ బాలుడికి విముక్తి కలిగించినట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని భీంరావ్‌కు చెందిన హర్యానా జిలేబీ సెంటర్‌లో ఆదివారం తనిఖీ చేయగా లేఖరాజు (11)అనే బాలుడు పనిచేస్తున్నట్లు గుర్తించారు. 20 రోజులుగా పని చేస్తున్నట్లు గుర్తించి మంచిర్యాల ఆనంద నిలయానికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.


