మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు

Jul 5 2026 11:22 PM | Updated on Jul 5 2026 11:22 PM

● ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ● రాంనగర్‌లో నార్కోటిక్‌ జాగిలం ‘రోమా’తో తనిఖీలు ● 39 గ్రాముల గంజాయి స్వాధీనం

ఆదిలాబాద్‌రూరల్‌: మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీసీఎస్‌ బృందం మావల పోలీసుస్టేషన్‌ పరిధి రాంనగర్‌ ప్రాంతంలో నార్కోటిక్‌ జాగిలం ‘రోమా‘సహాయంతో ఆదివారం విస్తృత తనిఖీ నిర్వహించా యి. జాగిలం అనుమానాస్పద ప్రదేశాన్ని గుర్తించడంతో పోలీసులు గోడెం ఆకాశ్‌ నివాసంలో సో దాలు చేపట్టారు. 13 ప్యాకెట్లలో నిల్వ ఉంచిన సు మారు 39 గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై కేసు న మోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి, ఇతర మా దకద్రవ్యాల విక్రయం, రవాణా, నిల్వ, వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదకద్రవ్యాలకు సంబంధించి వివరాలు తెలిస్తే ప్రజలు డయల్‌ 100, 8712659973 వాట్సాప్‌ నంబర్‌కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌, మావల ఎస్సై రాజశేఖర్‌ రెడ్డి, నార్కోటిక్‌ జాగిలం హ్యాండ్లర్‌ రమేశ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement