కుమారుడి మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుమారుడి మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

Jul 5 2026 11:22 PM | Updated on Jul 5 2026 11:22 PM

భైంసారూరల్‌: కుమారుడి మృతి తట్టుకోని తీవ్ర మ నస్తాపానికి గురైన తల్లి ఆ త్మహత్యకు పాల్పడింది. మండలంలోని ఇలేగాం గ్రామంలో ఈఘటన చో టుచేసుకుంది. ఎస్సై సుప్రియ వివరాల ప్రకారం.. ఇలేగాం గ్రామానికి చెందిన శారద(52), నాగభూషణ్‌ దంపతులకు ముగ్గురు కుమారులు. రెండోకొడుకు సాయినాథ్‌ ఏడాది క్రితం షార్ట్‌ సర్క్యూట్‌తో మృతి చెందాడు. అప్పటి నుంచి శారద మనోవేదనకు గురైంది. మానసికంగా కలత చెందిన ఆమె శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబీకులు ఆమె కోసం వెతికిన ఆచూకీ దొరకలేదు. ఆదివారం శారద మృతదేహం గ్రామ సమీపంలోని బావిలో కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి భైంసా ఏరియాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

తల్లి మందలించిందని కూతురు..

సిరికొండ: తల్లి మందలించిందని కూతురు పురుగు ల మందు తాగి ఆత్మహ త్య చేసుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై విక్రమ్‌ తె లిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వాయపేట్‌కు చెందిన పెందుర్‌ శోభబాయి భర్త నా లుగేళ్ల క్రితం మృతిచెందాడు. వ్యవసాయం చేస్తూ ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులను పోషించుకుంటుంది. ఏడాది క్రితం పెద్ద కుమార్తెకు వివాహం చేసింది. చిన్న కూతురు మంజుల (17)ను ఇంట్లో ఖాళీగా ఉంటోంది. ఏదైనా పని చేయాలని, ఏం చేయలేకపోతే ఎలా బతుకుతామని తల్లి మందలించింది. మనస్తాపం చెందిన మంజుల శుక్రవారం సాయంత్రం ఇంట్లో పురుగుల మందు తాగింది. వెంటనే ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. చికిత్సపొందుతూ అదివారం మృతిచెందింది. కుటుంబీకుల ఫిర్యాదుతో ఎస్సై కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement