తల్లీకుమారుడి అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

తల్లీకుమారుడి అంత్యక్రియలు

Mar 16 2026 7:53 AM | Updated on Mar 16 2026 7:53 AM

● మందమర్రిలో కలిచివేసిన ఘటన

మందమర్రిరూరల్‌: తల్లీకుమారుడి అంత్యక్రియలు ఒకే రోజు ఘటన మందమర్రిలో అందరినీ కంటతడి పెట్టించింది. వివరాలు ఇలా ఉ న్నాయి.. పట్టణంలోని రెండోజోన్‌కు చెందిన వీరవేణి–సత్యనారాయణ దంపతులకు ప్రసాద్‌, నాగసత్యవేణి సంతానం. నాగసత్యవేణికి హైదరా బాద్‌ (బోరబండ)కు చెందిన మురళీవేణుతో 13 మార్చి 2019లో వివాహమైంది. రుద్రాన్ష్‌ (5), ధన్విక (2) సంతానం. కొంతకాలం వీరి దాంపత్యం సాఫీగా సాగింది. పెళ్లయిన ఏడాది తర్వాత మురళీవేణుకు జెన్‌కోలో ఇంజినీర్‌గా ఉద్యోగం వ చ్చింది. అప్పటినుంచి భార్యను వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కట్నం వచ్చేది. నిన్ను చేసుకున్నందుకు కట్నం ఇవ్వలేదనే, భార్యను పుట్టింటివారితో మాట్లాడనిచ్చేవాడు కాదు. అదనపు కట్నం తేవాలని వేధించసాగాడు. తల్లిగారింటికి వెళ్తే త్వరగా తిరిగి రావాలని ఆంక్షలు విధించేవాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి తన అన్న ప్రసాద్‌కు ఫోన్‌చేసి అమ్మను, తన కుమారుడు (మేనల్లుడు)ని బాగా చూసుకోవాలని చెప్పింది. మళ్లీ రాత్రి 9:30 గంటలకు మురళీవేణు మందమర్రిలోని ప్రసాద్‌ ఫోన్‌చేసి మీ చెల్లి ఆత్మహత్య చేసుకుందని చెప్పగా హైదరాబాద్‌ వెళ్లాడు. గాంధీ ఆసుపత్రిలో నాగసత్యవేణి, రుద్రాన్ష్‌ మృతదేహాలు, ధన్విక నిలోఫర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని పోలీసులు చెప్పారు. శనివారం సాయంత్రం పోసుమార్టం అనంతరం మృతదేహాలను అప్పగించారు. ఆదివారం స్వగ్రామానికి తీసుకువచ్చి శ్మశానవాటికలో అంత్యక్రియలు చేశారు. తల్లికుమారుడి మృతి కారకులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement