ఆర్జీయూకేటీ–మ్యాట్‌విజ్ ఇంజన్యుటీ మధ్య ఒప్పందం
బాసర: ఆర్జీయూకేటీ మెటలర్జీ ఇంజినీరింగ్ విభాగం, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మ్యాట్‌విజ్ ఇంజన్యుటీ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆదివారం బాసర ట్రిపుల్ ఐటీలో వీడియోకాన్ఫరెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వీసీ, ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ సమక్షంలో ఒప్పందం జరిగింది. భాగస్వామ్య పత్రాలపై ఓఎస్డీ, పరిపాలన అధికారి ప్రొఫెసర్ ఇ.మురళీధర్, మ్యాట్‌విజ్ ఇంజన్యుటి సహ వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యనిర్వహణ అధికారి జె.విష్ణుజిత్ రాథోడ్ సంతకాలు చేశారు. అసోసియేట్ డీన్లు డాక్టర్ ఎస్. విఠల్, శీలం శేఖర్, డాక్టర్ కె.మహేశ్, మ్యాట్‌విజ్ ఇంజన్యుటి తరపున సహ వ్యవస్థాపకుడు ఎం.వీరేశ్, ఉత్పత్తి అభివృద్ధి విభాగం అధిపతి ఎస్.రామ్కిషన్ పాల్గొన్నారు.
భాగస్వామ్య లక్ష్యాలు
మెటలర్జీ, మెటీరియల్స్ ఇంజినీరింగ్ రంగాల్లో పరిశోధనలు ముమ్మరం చేయడం, నూతన సాంకేతిక ఆవిష్కరణలకు ఊతమివ్వడం ఒ ప్పంద ప్రధాన ఉద్దేశం. విద్యార్థులకు క్షేత్రస్థాయిలో నైపుణ్య శిక్షణ కల్పించడంలో ఇరు సంస్థలు సమన్వయంతో పనిచేస్తాయని మెటలర్జీ విభాగాధిపతి కిరణ్ కుమార్ వెల్లడించారు.
ఉపాధి: ఉద్యోగ అవకాశాలతోపాటు ’మేక్ ఇన్ ఇండియా’పథకం ద్వారా విద్యార్థులకు అవకాశాలు లభిస్తాయి.
కృత్రిమ మేధ: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు కృత్రిమ మేధలో ప్రత్యేక శిక్షణ అందించి వారిని నిపుణులుగా తీర్చిదిద్దుతారు.
హాజీపూర్ వాసికి అవార్డు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్స్‌లో ఆదివారం నిర్వహించిన బిల్డర్స్ డే వేడుకల్లో హాజీపూర్‌కు చెందిన మాధవరపు రామారావు తెలంగాణ రైజింగ్‌లో విశేష సేవలు అందించినందుకుగాను జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో అవార్డు లభించింది. రాష్ట్ర అధ్యక్షుడు సుందర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అసోసియేషన్‌కు రామారావు బిల్డర్స్ చేసిన సేవలకు గుర్తింపు లభించగా ఈ అవార్డు అందుకున్నారు. తనపై బాధ్యత మరింత పెరిగిందని రామారావు తెలిపారు.
ఆర్జీయూకేటీ–మ్యాట్‌విజ్ ఇంజన్యుటీ మధ్య ఒప్పందం


