హీరాసుకా జయంతిని విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

హీరాసుకా జయంతిని విజయవంతం చేయాలి

Mar 2 2026 8:22 AM | Updated on Mar 2 2026 8:22 AM

హీరాసుకా జయంతిని  విజయవంతం చేయాలి

హీరాసుకా జయంతిని విజయవంతం చేయాలి

ఆదిలాబాద్‌రూరల్‌:జిల్లాకేంద్రంలోని రాంలీలా మైదానంలో ఈనెల 15న నిర్వహించే ఆదివాసీ పర్ధాన్‌ సమాజ్‌ కులగురు గోండి ధర్మగురు హీరా సుకా జయంతి వేడుకలు విజయవంతం చేయాలని రాష్ట్రీయ పర్ధాన్‌ జన్‌జాతి ఉత్తన్‌ సంఘటన్‌ రాష్ట్ర ఇన్‌చార్జీ కుమ్ర గంగారాం పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని టీచర్స్‌ కాలనీలో సంఘటన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుర్సేంగే యాదవ్‌రావ్‌ నివాసంలో ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. కుమ్ర గంగారాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జయంతి వేడుకల సందర్భంగా గ్రామాల్లో ప్రచారం నిర్వహించే సమయంలో ఆదివాసీ పర్ధాన్‌ సమాజ్‌ మహిళలను భాగస్వామ్యులు చేయాలన్నారు. ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగాలన్నారు. అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం రాష్ట్ర ఇన్‌చార్జి గంగారాంను శాలువతో సత్కరించి ఆహ్వానపత్రం అందజేశారు. సమావేశంలో సంఘటన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోవా మనోహర్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి గోడం లక్ష్మణ్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మెస్రం శంకర్‌, గేడం మాధవ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు సుమతి, జాతీయ సంయుక్త కార్యదర్శి గేడం వనిత, రాష్ట్ర మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలు మెస్రం గంగాదేవి, జిల్లా గౌరవ అధ్యక్షురాలు మెస్రం సంగీత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement