భార్య కాపురానికి రావడం లేదని మరొకరు..
రెబ్బెన: భార్య కాపురానికి రా వడం లేదని మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. రెబ్బెన మండలంలోని చిలుకమర్రిగూడకు చెందిన పూదరి కిరణ్ (37)కు ఆసిఫాబాద్ మండలంలోని ఇదులవాడకు చెందిన సరితతో గత 13 ఏళ్ల వివాహమైంది. ఈ దంపతులకు 12 ఏళ్ల కూతురు ఉంది. వ్యవసాయంతో పాటు అప్పుడప్పుడూ లారీ క్లీనర్‌గా కిరణ్ పనిచేసేవాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్యతో గొడవపడేవాడు. మద్యం మానేయడాలని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే తల్లి తారక్కను సైతం ఇబ్బందులకు గురిచేసేవాడు. గొడవలకు తాళలేక మూడు నెలల క్రితం సరిత పుట్టింటికి వెవెళ్లింది. మద్యానికి బానిసగా మారడంతోపాటు భార్య కాపురానికి రావడం లేదని కిరణ్ మనస్తాపం చెందాడు. శనివారం రాత్రి ఇంటి పక్కన ఉన్న రేకులషెడ్డులో తాడుతో ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.


