టిఫిన్‌ సెంటర్‌ యజమాని అరెస్టు | - | Sakshi
Sakshi News home page

టిఫిన్‌ సెంటర్‌ యజమాని అరెస్టు

Mar 2 2026 8:22 AM | Updated on Mar 2 2026 8:22 AM

టిఫిన్‌ సెంటర్‌ యజమాని అరెస్టు

టిఫిన్‌ సెంటర్‌ యజమాని అరెస్టు

భీమారం: మండలకేంద్రంలో పలువురి నుంచి సుమారు రూ.1.58 కోట్లను తీసుకుని పరారైన టిఫిన్‌ సెంటర్‌ (హోటల్‌) యజమాని వేముల శ్రావణ్‌గౌడ్‌ను అరెస్టు చేసినట్లు జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. భీమారానికి చెందిన శ్రావణ్‌గౌడ్‌ గత కొన్నేళ్లుగా స్థానికంగా టిఫిన్‌సెంటర్‌ ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నాడు. వాటర్‌ప్లాంట్‌, పేపర్‌ప్లేట్ల వ్యాపారం చేసేవాడు. అందులో లాభాలు ఇస్తానని చెప్పి 62 మంది వద్ద దాదాపు రూ.1.58 కోట్లు తీసుకున్నాడు. ఇసుకరీచ్‌ కాంట్రాక్ట్‌ వచ్చిందని నమ్మించడంతో చాలా మంది నగదు ఇచ్చారు. వ్యాపారాల్లో నష్టం రావడంతో ఆ డబ్బులను సొంతానికి వినియోగించుకున్నాడు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పలువురు అడిగితే శ్రావణ్‌గౌడ్‌ కుటుంబంతో కలిసి పారిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆదివారం ఆవిడం ఎక్స్‌రోడ్డు వద్ద నిందితుడిని అరెస్ట్‌ చేశారు. అతని నుంచి రూ.8,500 నగదు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు. చెన్నూరు కోర్టులో హాజరుపర్చామన్నారు. ఈ కేసులో మరో నిందితుడు కిరణ్‌గౌడ్‌ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. శ్రావణ్‌కుమార్‌ను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్సై రాజేందర్‌, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement