విజయీభవ | - | Sakshi
Sakshi News home page

విజయీభవ

Feb 25 2026 9:47 AM | Updated on Feb 25 2026 9:47 AM

విజయీ

విజయీభవ

● నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు ● జిల్లాలో 23 పరీక్షా కేంద్రాలు ● నిమిషం ఆలస్యం సడలింపు ● హాజరయ్యే విద్యార్థులు 12,317

మంచిర్యాలఅర్బన్‌: ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు బుధవారం ప్రథమ, గురువారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 12,317మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. నిర్ణీత సమయానికి అరగంట ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ప్రశ్నపత్రాలు తెరిచే ప్రదేశాలతో సహా కేంద్రంలో నాలుగు నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధనకు సడలింపు ఇవ్వగా.. ఐదు నిమిషాల వరకు అనుమతిస్తారు.

హాల్‌టికెట్‌పై సంతకం లేకపోయినా..

హాల్‌టికెట్ల జారీలో ప్రైవేటు కళాశాలలు ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉండడంతో విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆన్‌లైన్‌ హాల్‌టికెట్‌తో కూడా పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ప్రిన్సిపాల్‌ సంతకం, కళాశాల ముద్ర లేకున్నా అనుమతించాలని సీఎస్‌, డీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా కారణాలు చూపి హాల్‌టికెట్లు ఇవ్వకుంటే ప్రిన్సిపాల్‌, యాజమాన్యంపై చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

మాస్‌కాపీయింగ్‌ కట్టడికి చర్యలు

మాస్‌కాపీయింగ్‌ నిరోధానికి హైపవర్‌ కమిటీ, జిల్లా పరీక్షల కమిటీ, ఫ్లయింగ్‌, రెండు సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలతో పర్యవేక్షిస్తారు. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడితే డిబార్‌ చేస్తామని అధికారులు హెచ్చరించారు. క్రిమినల్‌ కేసులు నమోదైతే విద్యార్థులు ఉద్యోగానికి అనర్హులవుతారు. పరీక్ష కేంద్రం వద్ద 163 బీఎన్‌పీఎస్‌ సెక్షన్‌ అమలు, పరీక్షలు పూర్తయ్యే వరకు జిరాక్స్‌ సెంటర్లు మూసి ఉంచుతారు.

బాలికలకు ఉచితం.. బాలురకు లేనట్లే..

పరీక్ష కేంద్రాలు ఉన్న రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుపనుంది. బాలికలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండగా.. బాలురు టికెట్‌ కొనుగోలు చేసి ప్రయాణించాల్సి ఉంటుంది. ఇదివరకు కళాశాలల(పరిమితి రూట్‌) వరకు వెళ్లేందుకు బస్‌పాస్‌ పొందిన విద్యార్థులు పరీక్ష కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేసినా ఆ రూట్లలో వెళ్లేలా వెసులుబాటు కల్పించగా.. ఈ ఏడాది అదీ లేకుండాపోయింది.

రాసేముందు రిలాక్స్‌ కావాలి

పరీక్ష కేంద్రంలో ఇతరులతో పోలికలు చేయకూడదు. హాల్‌లో కూర్చున్న తర్వాత రెండు నిమిషాలు కళ్లు మూసుకుని రిలాక్స్‌ కావాలి. ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి సులభమైన ప్రశ్నలతో మొదలుపెట్టాలి. తెలిసిన ప్రశ్నే కదా అని ఒకే సమాధానాన్ని గంటల తరబడి రాయొద్దు. కష్టమైన ప్రశ్న వద్ద ఆగిపోకుండా తెలిసినవి ముందుగా రాస్తే మంచిది. పరీక్ష హాలులోకి వెళ్లే చివరి నిమిషం వరకు చదవడం వల్ల విషయాలు గుర్తుకు రాకపోగా గందరగోళం ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో వెళ్లడం వల్ల పరీక్ష మధ్యలో నీరసం రావడం ఏకాగ్రత తగ్గిపోతుంది. జంక్‌ఫుడ్‌, ఆయిల్‌పుడ్‌, స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉంటే మంచిది. తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. – ప్రకాశ్‌ బానావత్‌, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌

భయం వీడి రాయండి..

ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యుత్‌, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు చేపట్టాం. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాం. ఏవైనా సమస్యలు, సందేహాల నివృత్తికి కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. 8328172384(సురేశ్‌), 9505960704(నవీన్‌) సెల్‌ఫోన్‌ ద్వారా సంప్రదించవచ్చు. విద్యార్థులు భయం వీడి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి.

– అంజయ్య, డీఐఈవో

రేకుల షెడ్డు.. ఫ్యాన్లు లేవు

దండేపల్లి: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలతోపాటు లింగాపూర్‌ మోడల్‌ స్కూల్‌, దండేపల్లి కేజీబీవీ విద్యార్థుల కోసం దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంటర్‌ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 185 మంది విద్యార్థుల కోసం ఆరు గదులు కేటాయించారు. అందులో ఐదు జెడ్పీ ఉన్నత పాఠశాలకు సంబంధించినవి. కాలేజీకి చెందిన ఓ గది రేకుల షెడ్డు కాగా.. అందులో ఫ్యాన్లు లేవు. ఈ ఒక్కటీ అన్ని వసతులు ఉన్న గది కేటాయిస్తే బాగుంటుందని, ఫ్యాన్లు అయినా బిగించాలని పలువురు కోరుతున్నారు.

సమస్యలు, సందేహాల నివృత్తికి కంట్రోల్‌రూమ్‌ నంబర్లు

8328172384, 9505960704

విద్యార్థుల వివరాలు

సంవత్సరం జనరల్‌ ఒకేషనల్‌

ప్రథమ 5,372 888

ద్వితీయ 5,227 830

సిబ్బంది ఇలా..

చీఫ్‌ సూపరింటెండెంట్లు–23

డిపార్ట్‌మెంట్‌ అధికారులు– 23

ఇన్విజిలేటర్లు –612

కస్టోడియన్లు–03

విజయీభవ 1
1/2

విజయీభవ

విజయీభవ 2
2/2

విజయీభవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement