గ్రామస్థాయిలో జీపీవోల పాత్ర కీలకం
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తూ గ్రామస్థాయి పరిపాలనలో జీపీవోల పాత్ర కీలకమైనదని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జీపీఓ, ఆర్‌ఐ యాప్‌పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి తహసీల్దార్ మల్లికార్జున్, ఈ డిస్ట్రిక్ మేనేజర్ సునిల్‌తో కలిసి హాజరయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ధ్రువపత్రాల జారీ, లబ్ధిదారుల ఎంపిక జీపీవోల ద్వారా చేస్తామని తెలిపారు. విధుల సమయంలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


