ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్‌ను ప్రభుత్వమే నిర్వహించాలి
మంచిర్యాలటౌన్: రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి పలు ఏజెన్సీలు, పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించడం లేదని, ఏజెన్సీలను తొలగించి రాష్ట్ర ప్రభుత్వమే ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిర్వహించాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఎంప్లాయిస్(ట్రేడ్ యూనియన్) రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో యూనియన్ సమావేశం నిర్వహించారు. జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా యూనియన్ అధ్యక్షుడుగా కే.రాఘవేంద్ర, ఉపాధ్యక్షుడుగా అశ్విన్, గౌరవ అధ్యక్షుడిగా ఎం.శ్రీధర్, కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు.


