ట్రామా.. కేర్ లేదా..!
బెల్లంపల్లి కాల్‌టెక్స్ ఏరియాకు చెందిన బొలేరో డ్రైవర్ కొమ్మెర విజయ్ గత నెల 23న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన శివారులో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
బెల్లంపల్లి కాల్‌టెక్స్ అండర్ బ్రిడ్జి వద్ద గత నెల 25న కారు ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళ్తున్న బెల్లంపల్లి ఏఎంసీ ఏరియాకు చెందిన సాయికుమార్ తలకు తీవ్ర గాయాలై దుర్మరణం చెందాడు.
బెల్లంపల్లి: రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులకు వైద్యం అందడంలో మొదటి గంట కీలకమని వైద్యులు చెబుతుంటారు. సకాలంలో ఆ స్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తే ప్రాణా లు నిలబెట్టవచ్చని అంటారు. బెల్లంపల్లిలో ప్రభు త్వ ఆస్పత్రి ఉన్నా ట్రామాకేర్ సెంటర్ లేక రోడ్డు ప్రమాద క్షతగాత్రులను దూర ప్రాంతాల్లోని ఆస్పత్రికి తరలించే లోపు ప్రాణాలు కోల్పోతున్నారు. బె ల్లంపల్లి శివారు నుంచి హైదరాబాద్–చంద్రాపూర్ జాతీయ రహదారి నిర్మించారు. నాలుగు వరుసల రహదారి ఏర్పడడంతో వన్‌వేలో వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నాయి. మోటార్‌సైకిళ్లు, కార్లు పరిమి తికి మించిన వేగంతో పరుగులు తీస్తున్నాయి. కు మురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన నుంచి బెల్లంపల్లి శివారు సోమగూడెం వరకు కొన్ని చోట్ల బ్లాక్‌స్పాట్‌లను గుర్తించారు. జాతీయ రహదారిపై సో మగూడెం శివారు కల్వరి చర్చి, బెల్లంపల్లికి వచ్చే హైవే చౌరస్తా, సెయింటు మేరీస్ హైసూ్‌క్‌ల్ ముందు, కుంటరాములు బస్తీ, కన్నాల చౌరస్తా, బోయపల్లి వార్డు, తాండూరు, రేపల్లెవాడ, రెబ్బెన మండలం గోలేటి టౌన్‌షిప్‌కు వెళ్లే చౌరస్తా, కాగజ్‌నగర్ క్రాస్ రోడ్డు తదితర ప్రాంతాలు బ్లాక్‌స్పాట్ జాబి తాలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, అజాగ్రత్త, అతివే గం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. హెల్మెట్ ధరించకుండా మోటారుసైకిళ్లు నడపడం, మద్యం తాగి, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్, చౌరస్తాలు, మూలమలుపుల వద్ద గందరగోళానికి గురి కావడం, కారు డ్రైవర్, ముందు సీటులోని వ్యక్తి సీటుబెల్ట్ ధరించకపోవడం, మైనర్ డ్రైవింగ్ తదితర కారణాల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.


