
● ఉత్తర తెలంగాణలో జిల్లాకు ప్రథమస్థానం ● అన్ని వర్గాల అ
జెండాకు వందనం చేస్తున్న ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు, జిల్లా ఉన్నతాధికారులు
మంచిర్యాలఅగ్రికల్చర్: ఉత్తర తెలంగాణలో మంచిర్యాల జిల్లా ప్రథమ స్థానంలో దూసుకెళ్తోందని, అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే..
సన్నబియ్యం సరఫరా
ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించి రూ.13వేల కోట్ల వ్యయంతో 3.10కోట్ల మందికి అందిస్తోంది. జిల్లాలో 2,47,923 మంది కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేశాం. పోర్టబులిటి విధానం ద్వారా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా రేషన్ బియ్యం తీసుకునే వీలు కల్పించాం.
కొత్త రేషన్‌కార్డులు
జూలై 14నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభించాం. పదేళ్ల తర్వాత పేదలకు రేషన్‌కార్డులు చేతికందాయి. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు 24,079 నూతన రేషన్‌కార్డులు అందించడంతోపాటు పాత కార్డుల్లో పిల్లల పేర్లు చేర్పులకు 41,677 దరఖాస్తులు పరిశీలించి 53,040మందిని చేర్చాం.
రాజీవ్ ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం
రాజీవ్ ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ బ్రాండ్ స్కీం. మసకబారిన ఈ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాం. జిల్లాలో 9,120మంది పేదలు చికిత్స పొందారు. ఇందుకు ప్రభుత్వం రూ.14.15కోట్లు ఖర్చు చేసింది.
ఆడబిడ్డలకు అండగా..
ప్రజా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది. ఆడబిడ్డలకు ఈ పథకం ద్వారా రూ.6,790 కోట్లు ఆదా అయ్యింది. జిల్లాలో ఉచిత రవాణా ద్వారా 2,24,03,654 మంది మహిళలకు లబ్ధి చేకూరింది. రూ.500కే వంట గ్యాస్ సరఫరా ద్వారా మహిళలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించి జిల్లాలో 1,22,837 మంది లబ్ధిదారులకు రూ.14.63 కోట్లు రాయితీ మంజూరు చేశాం.
గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్..
200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా ద్వారా జిల్లాలో ప్రతీ నెల లక్ష నివాసాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ 1,25,759 మంది వినియోగదారులకు నెలకు రూ.4.96 కోట్లు ఖర్చు చేస్తూ ఇప్పటివరకు రూ.71.38 కోట్లు లబ్ధి చేకూర్చింది.
భూభారతి..
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభార తి చట్టాన్ని ప్రవేశపెట్టి రైతులకు అనుకూలంగా అప్పీలు వ్యవస్థను పొందుపర్చింది. జిల్లాలో ప్రతీ మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా వచ్చిన 51,503 దరఖాస్తుల్లో 26,744 దరఖాస్తులు వివిధ స్థాయిల్లో పరిశీలనలో ఉన్నాయి.
విద్యారంగం బలోపేతం
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టాం. జిల్లాలో 510 ప్రభుత్వ పాఠశాలల్లో పనులు పూర్తి చేసి మిగతా వాటిల్లో పురోగతిలో ఉన్నాయి. 688 పాఠశాలలకు స్కూల్ ఫెసిలిటీ గ్రాంటు రూ.1,64,30,000 ఐదు నెలలకు ఇచ్చాం. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు గతంలో ఎన్నడూ లేని విధంగా 40 శాతం డైట్, 200 శాతం కాస్మొటిక్ చార్జీలు పెంచి నూతన మెనూ అమలు చేస్తూ పౌష్టికాహారం అందించి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం..
మున్సిపాలిటీలు..
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ఐదు బల్దియాల్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. మంచిర్యాలలో రూ.10.22 కోట్లతో రాష్ట్రంలోనే అత్యుత్తమంగా మహాప్రస్థానం నిర్మించాం. అమృత్ 2.0 పథకం కింద బల్దియాలకు రూ.275 కోట్లు మంజూరు చేసి పనులు పురోగతిలో ఉన్నాయి.
వైద్య, ఆరోగ్య శాఖ భవనాల నిర్మాణం
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవన నిర్మాణం, నర్సింగ్ కళాశాల, వైద్య విద్య కోసం రూ.40 కోట్లతో భవన నిర్మాణం, రూ.3.50 కోట్లతో మందుల నిల్వ గిడ్డంగి నిర్మించాం. గుడిపేటలో రూ.216 కోట్ల వ్యయంతో అధునాతన వైద్య కళాశాల నిర్మాణం జరుగుతుంది. కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ.భాస్కర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్‌సింగ్, ఏసీపీ ప్రకాష్, సబ్ కలెక్టర్ మనోజ్, ఐఎన్‌టీయూసీ నాయకుడు జనక్‌ప్రసాద్ పాల్గొన్నారు.
విద్యార్థిని నృత్యం
ఇందిరా మహిళా శక్తి..
రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. జిల్లాలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా దండేపల్లి మండలంలో శంకుస్థాపన చేసి మరొకటి ఏర్పాటుకు మందమర్రి మండలాన్ని గుర్తించాం. మహిళలకు పెట్రోల్‌బంక్‌లు, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ, ఇందిరా శక్తి స్టాళ్లు, మీసేవ కేంద్రాలను ప్రారంభించింది.
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు..
తొలి విడతగా ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. అన్ని శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నాం. జిల్లాలో 10,377 ఇళ్లు మంజూరు కాగా 6,373 ఇళ్లు మార్కవుట్, 1,870 ఇళ్లు బేస్‌మెంటు, 164 గోడలు, 24 స్లాబ్ నిర్మాణ స్థాయిలో ఉన్నాయి. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15.49కోట్లు జమ చేశాం. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఈ ఏడాది మార్చి 17న అసెంబ్లీలో ఆమోదించింది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీల్లో 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి గ్రూప్–1లో 15, గ్రూప్–2లో 18, గ్రూప్–3లో 26 కులాలను చేర్చాం.
అలరించిన విద్యార్థుల నృత్యాలు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. దేశభక్తి గీతాలపై చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు, కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు విద్యార్థులను అభినందించి బహుమతలు అందజేశారు.

● ఉత్తర తెలంగాణలో జిల్లాకు ప్రథమస్థానం ● అన్ని వర్గాల అ

● ఉత్తర తెలంగాణలో జిల్లాకు ప్రథమస్థానం ● అన్ని వర్గాల అ