
కార్మికుల హక్కులు సాధించిన టీబీజీకేఎస్
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికులకు చరిత్రలో నిలిచిపోయే హక్కులను టీబీజీకేఎస్ సాధించిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన నస్పూర్ కాలనీలో టీబీజీకేఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షులు బండి రమేష్ పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దివాకర్‌రావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల సమస్యలను పరిష్కరించామని, ఏ సమస్య వచ్చినా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి ప్రయోజనాలు చేకూర్చారని తెలిపా రు. కారుణ్య ఉద్యోగాలు ఇప్పించారని అన్నా రు. టీబీజీకేఎస్‌కు పూర్వ వైభవం తీసుకురావడానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు యన్.విజిత్‌రావు, యూని యన్ కేంద్రం ఉపాధ్యక్షుడు నూనె కొముర య్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, జాయింట్ సెక్రెటరీ సత్తయ్య, మాజీ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, నాయకులు అన్వేష్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుబ్బయ్య, నాయకులు మేరకు పవన్, బేర సత్యనారాయణ, అత్తి సరోజ, వంగ తిరుపతి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.