
సమరయోధుల ఆశయ సాధనకు కృషి
మంచిర్యాలక్రైం: స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కమిషనరేట్‌లో స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయుధ పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన ఉత్తమ పోలీసు అధికారులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు రమేష్, మల్లారెడ్డి, శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.