● 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ● టెక్నాలజీ, అభివృద్ధి, విద్య, వైద్యరంగాల్లోనూ ఘనత ● వందేళ్ల భారతంలో అభివృద్ధిపై యువత అభిప్రాయం ● వందేళ్ల భారత్‌ ఎలా ఉండాలి అనే అంశంపై ‘సాక్షి’ టాక్‌ షో | - | Sakshi
Sakshi News home page

● 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ● టెక్నాలజీ, అభివృద్ధి, విద్య, వైద్యరంగాల్లోనూ ఘనత ● వందేళ్ల భారతంలో అభివృద్ధిపై యువత అభిప్రాయం ● వందేళ్ల భారత్‌ ఎలా ఉండాలి అనే అంశంపై ‘సాక్షి’ టాక్‌ షో

Aug 15 2025 8:25 AM | Updated on Aug 15 2025 8:25 AM

● 204

● 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ● టెక్నాలజీ, అభివ

● 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ● టెక్నాలజీ, అభివృద్ధి, విద్య, వైద్యరంగాల్లోనూ ఘనత ● వందేళ్ల భారతంలో అభివృద్ధిపై యువత అభిప్రాయం ● వందేళ్ల భారత్‌ ఎలా ఉండాలి అనే అంశంపై ‘సాక్షి’ టాక్‌ షో

న్యాయ వ్యవస్థలో మార్పు రావాలి

న్యాయవ్యవస్థలో న్యా యం జరిగేందుకు ఏళ్లుగా బాధితులు ఎదు రు చూడాల్సి వస్తోంది. వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం జరిగేలా మార్పులు రావాలి. దేశం ఇప్పటికీ టెక్నాలజీలో దూసుకుపోతూ ఎన్నో రకాల రీసెర్చ్‌లకు కేంద్ర బిందువుగా మారుతోంది. టెక్నాలజీలో యువతకు మంచి అవకాశాలు కల్పించాలి.

– దానిష్‌ మినహాజ్‌, బీఎస్సీ సెకండియర్‌,

మంచిర్యాల

మంచిర్యాలటౌన్‌: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047నాటికి వందేళ్లు పూర్తవనుండగా.. ఆ నాటికి మన దేశం ప్రపంచాన్ని శాసించే స్థాయిలో అన్ని రంగాల్లోనూ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంటుందని యువత అభిప్రాయ పడింది. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘వందేళ్ల భారతం ఎలా ఉండాలి’ అనే అంశంపై ‘సాక్షి’ గురువారం మంచిర్యాలలోని మిమ్స్‌ డిగ్రీ కళాశాలలో టాక్‌షో నిర్వహించింది. కళాశాల ప్రిన్సిపాల్‌ పి.ఉపేందర్‌రెడ్డి, డిగ్రీ విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశానికి ఏదో చేయాలనే తపనతో విద్యార్థులు, యువత ముందుకు వచ్చే అవకాశం ఉందని, వందేళ్లలో దేశ పురోగాభివృద్ధి బాగుంటుందని, ప్రపంచాన్ని శాసించే సూపర్‌పవర్‌గా భారత్‌ ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. దేశానికి యువతనే వెన్నెముక, ప్రభుత్వం సరైన అవకాశాలు కల్పిస్తే దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారని స్పష్టం చేశారు. చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రభుత్వం యువతకు పూర్తి సహకారం అందించడంతోపాటు ఉపాధి అవకాశాలను పెంపొందిస్తేనే దేశాభివృద్ధికి దోహాదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి బ్యూరో ఇంచార్జి రాజు, పీడీ నూనె శ్రీనివాస్‌, లెక్చరర్లు మహేశ్‌, చంద్రశేఖర్‌, సుమలత, శ్వేత, సుధాకర్‌, గోపి, విద్యార్థులు పాల్గొన్నారు.

టెక్నాలజీలో మరింతగా రాణించాలి

భారతదేశం టెక్నాలజీలో ఎంతగానో ఎదిగింది. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే టెక్నాలజీలో మరింతగా రాణించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ వంటి వాటిలో యువత రాణించేలా చూస్తే మన దేశాన్ని వారే అభివృద్ధి పథంలో తీసుకెళ్తారు.

– కే.సాయివిగ్నేష్‌, బీబీఏ సెకండియర్‌,

మంచిర్యాల

అభివృద్ధి సాధించాలి

దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. విద్య, ఉద్యోగం, వైద్యం, కోర్టుల్లో జరిగే న్యాయం సత్వరంగా అందడంతోపాటు మారుతున్న కాలానుగుణంగా ప్రభుత్వం ఆలోచించాలి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అనేది చిన్ననాటి నుంచే విద్యతోపాటు అందించాలి.

– ఎన్‌.భూమిక, ఎంఎస్‌టీసీఎస్‌, ఫస్టియర్‌, మంచిర్యాల

టెక్నాలజీ, విద్య అందాలి

స్వాతంత్య్రం సాధించిన 78 ఏళ్లలోనే దేశ జీడీపీతోపాటు ఎంతగానో అభివృద్ధి సాధించింది. మరో 22 ఏళ్లలో దేశం ప్రపంచంలోనే గొప్పదేశంగా మారేందుకు అవకాశాలున్నాయి. టెక్నాలజీ, ప్రతీ ఒక్కరికి ఉచితంగా విద్య అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. ఎంతోమంది విద్యావంతులు తయారై దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తారు.

– సిహెచ్‌.కౌశిక్‌, ఎంఎస్‌టిడిఎస్‌ ఫస్టియర్‌, మంచిర్యాల

● 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ● టెక్నాలజీ, అభివ1
1/2

● 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ● టెక్నాలజీ, అభివ

● 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ● టెక్నాలజీ, అభివ2
2/2

● 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ● టెక్నాలజీ, అభివ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement