
ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఆగుతుంది..
బెల్లంపల్లి: మంచిర్యాల, బెల్లంపల్లి రైల్వేస్టేషన్లలో ఏపీ సంపర్క్‌క్రాంతి ట్రైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నిలుపుదలకు రైల్వే అధికారులు ఎట్టకేలకు సానుకూలత వ్యక్తం చేశారు. ఈ నెల 2న ‘సాక్షి’లో ‘రైళ్లు ఆగవా..’ శీర్షికన ప్రచురితమైన కథనంలో ఆయా స్టేషన్లలో హాల్టింగ్ ఎత్తివేసిన వైనాన్ని ప్రస్తావించడం తెలిసిందే. స్పందించిన రైల్వే అధికారులు హజ్రత్ నిజాముద్దీన్(న్యూఢిల్లీ) నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతికి వెళ్లే ఏపీ సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును దిగువ మార్గంలో ఆయా రైల్వేస్టేషన్లలో నిలుపుదలను పునరుద్ధరిస్తూ రైల్వే రిజర్వేషన్ పోర్టల్ ఐఆర్‌సీటీసీలో అప్‌డేట్ చేశారు. ఈ నెల 21 నుంచి నిలుపుదలకు పొందుపర్చారు. రైల్వే ప్రయాణికుల సమస్యలు, రైళ్ల హాల్టింగ్ ఎత్తివేతపై రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి తోడ్పడిన ‘సాక్షి’కి, రైల్వే ఉన్నతాధికారులకు ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు ఫణి, ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఆగుతుంది..