
ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్
భీమిని: భీమిని, కన్నెపల్లి మండలాల్లో ముంపు ప్రాంతాలను కలెక్టర్ కుమార్ దీపక్ సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి బుధవారం పరిశీ లించారు. కన్నెపల్లి మండలం సాలీగాం పీపీ రావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో ఇళ్లలోకి నీరు చేరగా.. వారు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు ఏర్పాటుతో తమకు నష్ట పరిహారం రాలేదని బాధితులు మొర పెట్టుకున్నారు. నష్ట పరిహారం రాని వారి జాబితా తయారు చేసి పంపించాలని తహసీల్దార్ శ్రవణ్‌కుమార్‌ను కలెక్టర్ ఆదేశించారు. మేరీమాత పాఠశాలలో పునరావాసం, సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. భీమిని మండలం ఖర్జీభీంపూర్, రాజారాం గ్రామాలకు వెళ్లే రోడ్డు కోతకు గురి కాగా పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. చిన్నతిమ్మాపూర్, తంగళ్లపల్లి గ్రామాల్లో ముంపునకు గురైన పంటలను పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. ఎంపీడీవోలు గంగామోహన్, శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్లు బికార్ణదాస్, శ్రవణ్‌కుమార్, ఎస్సైలు విజయ్‌కుమార్, భాస్కర్‌రావు పాల్గొన్నారు.