
కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలి
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ నిర్మాణంలో కొత్త ప్రక్రియకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టనుందని తెలంగాణ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్, మంచిర్యాల నియోజకవర్గం అడ్వైజర్ జంగా రాఘవరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం సాయంత్రం పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పీసీసీ సభ్యుడు రామ్ భోపాల్‌తో కలిసి రాఘవరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బూత్ లెవల్ స్థాయి నుంచి గ్రామీణ, మండల, జిల్లాస్థాయిలో పటిష్టం చేయాలన్నారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉన్న నాయకులు, కార్యకర్తలను నాయకత్వం గుర్తిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు.