
ఇసుక లోడుతో వెళ్తున్న నంబర్ లేని ట్రాక్టర్
మందమర్రిరూరల్: మండలంలోని పాలవాగు, రాళ్లవాగు, పెద్దవాగు, కొండెంగల వాగుల నుంచి ఇసు క అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఇసుక తోడేస్తుండడంతో భూగర్భ జలం అడుగంటిపోతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో ట్రాక్ట ర్ల యజమానులు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వర్షాలు పడిన సమయంలో వరద రాగానే ఇసుక మేటలు వేస్తుంది. వర్షాలు తగ్గిన తర్వాత ట్రాక్టర్ల యాజమనులు అక్రమంగా తరలిస్తూ ఒక్కో ట్రిప్పు రూ.3వేలకు విక్రయిస్తున్నారు. మండలంలోని సిమెంటు ఇటుకల తయారీదారులు అక్రమంగా ఇసుక నిల్వ చేస్తున్నారు. ట్రాక్టర్ల యజమానులు నంబర్లు లేని ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి అనుకూలమైన ప్రదేశంలో నిల్వ చేస్తున్నారు. ఎవరైనా అడిగితే అప్పటికప్పుడు చేరవేస్తున్నారు. వాగుల్లో నుంచి ఇసుక తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇసుక తరలింపుపై మందమర్రి తహసీల్దార్ చంద్రశేఖర్‌ను సంప్రదించగా.. వాగుల్లో నుంచి ఇసుక తరలింపునకు అనుమతి లేదని, అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
సిమెంట్ ఇటుకల తయారీదారుల వద్ద నిల్వలు
వాగుల నుంచి ట్రాక్టర్లలో తరలింపు

అందుగులపేటలో నిల్వ ఉంచిన ఇసుక