
రక్తదాన శిబిరంలో అధికారులు
జైపూర్: రక్తదానం మహాదానం అని, రక్తదానం చే సి మరొక్కరికి ప్రాణదాతలుగా నిలవాలని ఎస్టీపీపీ వోఅండ్‌ఎం చీఫ్ జెన్‌సింగ్ తెలిపారు. మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ) లో శనివారం డాక్టర్ బీఆర్.అంబేద్కర్ 133వ జ యంతి వేడుకలను పురస్కరించుకుని మెగా రక్తదా న శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ఎస్టీపీపీ వోఅండ్‌ఎం చీఫ్ జెన్‌సింగ్, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఎస్టీపీపీలో విధులు నిర్వర్తిస్తున్న ఉన్నతా ధికారులతోపాటు పవర్‌మేక్ కంపెనీ ఉద్యోగులు, కార్మికులు, సీఐఎస్‌ఎఫ్ ఉద్యోగులు 121 మంది రక్తదానం చేశారు. మంచిర్యాల రెడ్‌క్రాస్ సొసైటీ వై ద్యుల బృందం రక్తాన్ని సేకరించారు. రక్తదాతలకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజీ ఎంలు కేఎస్‌ఎన్.ప్రసాద్, సుధాకర్, డీజీఎంలు సు ధాకర్‌రెడ్డి, జనగామ శ్రీనివాస్, పీవీ.బ్రహ్మాం, సీ ఎంవోఏఐ అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్, ఏ ఐటీయూసీ ఫిట్ కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, ఎస్‌వో టు జీఎం వెంకటయ్య, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పంతులా, నాయకులు భీమా, పర్సనల్ మేనేజర్ రామశాస్త్రి పాల్గొన్నారు.
టీచర్లకు ప్రమోషన్‌లు ఇవ్వాలి
మంచిర్యాలఅర్బన్: టెట్‌తో సంబంధం లేకుండా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజావేణు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో టీఎస్ యూటీఎఫ్ ఆవిర్భావం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉద్యమ పతాకాన్ని ఉమ్మడి జిల్లా పూర్వ జిల్లా అధ్యక్షుడు ఆగాచారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని పెండింగ్‌లో ఉన్న మూడు డీఏ లు చెల్లించాలని అన్నారు. వేసవి సెలవుల్లో బది లీలు నిర్వహించి జూన్ 4న రిలీవ్ చేయాలని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బిల్లులు చె ల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో శాధికారి కిరణ్, జిల్లా కార్యదర్శి వి.కిరణ్, మండల ప్రధాన కార్యదర్శి అబ్థుల్ వాహిద్, భీమారం మండల ఉపాధ్యక్షుడు కై లాసం, లక్సెట్టిపేట మండల ఉ పాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పతాకావిష్కరణ చేస్తున్న ఆగాచారి