మూడు నియోజకవర్గాలు.. ఆరుగురు మహిళలు | - | Sakshi
Sakshi News home page

మూడు నియోజకవర్గాలు.. ఆరుగురు మహిళలు

Oct 22 2023 12:08 AM | Updated on Oct 22 2023 12:08 AM

- - Sakshi

● ఉమ్మడి జిల్లాలో ఆమె ప్రాతినిధ్యం తక్కువే ● ఓటర్లు ఎక్కువ.. పోటీ తక్కువ ● ఏడు నియోజకవర్గాల్లో దక్కని అవకాశం

ఆసిఫాబాద్‌లో ముగ్గురు..

కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు నిర్వహించగా ముగ్గురు మహిళలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించారు. జిల్లాలో ఎన్నో ప్రత్యేకతలు, చారిత్రక ఉద్యమాలకు నెలవుగా ఉన్న ఆసిఫాబాద్‌ నియోజకవర్గం 31 ఏళ్లుగా ఎస్సీ రిజర్వ్‌డ్‌గా సాగినా, పునర్విభజనలో భాగంగా ఎస్టీ రిజర్వ్‌డ్‌గా మారింది. 1999లో బెల్లంపల్లికి చెందిన వైద్యురాలు పాటి సుభద్ర తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దాసరి నర్సయ్యపై గెలుపొందారు. 2004లో బెల్లంపల్లికే చెందిన అమరాజుల శ్రీదేవి టీడీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కోవ లక్ష్మి పోటీచేసి గెలుపొందారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఇప్పటి వరకు ఆరుగురు మహిళలు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఆసిఫాబాద్‌లో నియోజకవర్గంలో ముగ్గురు, సిర్పూర్‌ నియోజకవర్గంలో ఒక్కరు, ఖానాపూర్‌ నియోజకవర్గంలో ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మిగిలిన ఏడు నియోజకవర్గాలు ఆదిలాబాద్‌, బోథ్‌, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, నిర్మల్‌, ముధోల్‌ నుంచి ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. – మంచిర్యాలటౌన్‌/భైంసాటౌన్‌

సిర్పూర్‌ నుంచి ఒక్కరు..

1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుమురంభీం జిల్లా సిర్పూర్‌ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి రాజ్యలక్ష్మి మొదటి మహిళా శాసన సభ్యురాలిగా గెలుపొందింది. అప్పటి వరకు ఎన్నికల బరిలో నిలిచిన పాల్వాయి పురుషోత్తంరావు ఎన్నికల నామినేషన్‌ సమయంలో ఒక్కరోజు ముందు నక్సలైట్‌ దాడిలో మృతి చెందడంతో అతని భార్య రాజ్యలక్ష్మికి టికెట్‌ కేటాయించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు.

ఖానాపూర్‌ నుంచి ఇద్దరు...

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ నియోజకవర్గానికి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రాథోడ్‌ సుమన్‌బాయి గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి అజ్మీరా రేఖానాయక్‌ రెండుసార్లు విజయం సాధించారు.

1
1/9

2
2/9

3
3/9

కోవ లక్ష్మి4
4/9

కోవ లక్ష్మి

పాల్వాయి రాజ్యలక్ష్మి
5
5/9

పాల్వాయి రాజ్యలక్ష్మి

రాథోడ్‌ 
సుమన్‌ బాయి
6
6/9

రాథోడ్‌ సుమన్‌ బాయి

అజ్మీరా రేఖానాయక్‌7
7/9

అజ్మీరా రేఖానాయక్‌

అమరాజుల శ్రీదేవి
8
8/9

అమరాజుల శ్రీదేవి

పాటి సుభద్ర
9
9/9

పాటి సుభద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement