పాలపిట్టతో పర్యావరణ సమతుల్యత | - | Sakshi
Sakshi News home page

పాలపిట్టతో పర్యావరణ సమతుల్యత

Oct 19 2026 2:13 AM | Updated on Oct 19 2026 2:13 AM

జన్నారం: పాలపిట్ట మన పర్యావరణ సమతుల్యత ను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని, పంట లకు హాని చేసే కీటకాలను తింటూ రైతులకు మేలు చేస్తుందని ఫారెస్ట్‌ డివిజనల్‌ అధికారి రామ్మోహన్‌ పేర్కొన్నారు. ఆదివారం జన్నారం అటవీ డివిజన్‌లో పాలపిట్టపై అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్‌ను సిబ్బంది తో కలిసి డివిజన్‌ కార్యాలయంలో ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవుల నరికివేత, వ్యవసాయ పంటల్లో పురుగుమందుల అధిక వినియోగం లాంటి కారణాలతో పాలపిట్టల సంఖ్య తగ్గుతోందని తెలిపారు. పాలపిట్టల ను పట్టుకోవడం, వేటాడడం, బంధించడం, విక్రయించడం, హింసించడం లాంటి కార్యకలాపాలు చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. నిబంధనలు ఉ ల్లంఘిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకా రం చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు వ న్యప్రాణులను సంరక్షించి, ప్రకృతి పరిరక్షణలో భా గస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జన్నారం, తాళ్లపేట అటవీశాఖ రేంజ్‌ అధికారులు బాబా ఖా దర్‌వలీ, విలాస్‌, డిప్యూటీ రేంజ్‌ అధికారులు, సెక్ష న్‌ అధికారులు, బీట్‌ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర పక్షిని బతికిద్దాం

చెన్నూర్‌: తెలంగాణ రాష్ట్ర గౌరవానికి ప్రతీక, ప్రకృతికి వన్నె తెచ్చే రాష్ట్ర పక్షి పాలపిట్టను రక్షిద్దామని ఎఫ్‌డీవో రాంమూర్తి పేర్కొన్నారు. స్థానిక ఫారెస్ట్‌ కార్యాలయంలో ‘పాలపిట్టను రక్షిద్దాం’ అనే ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్షుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. దీనిపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మానవ మనుగడ పక్షులతో ముడిపడి ఉందని, పక్షులను బతికించే బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలని సూచించారు. చెన్నూర్‌ ఎఫ్‌ఆర్వో చంద్రమౌళి, నీల్వాయి ఎఫ్‌ఆర్వో హఫీజొద్దీన్‌, డిప్యూటీ ఆర్వో ప్రభాకర్‌, హేమలత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement