మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని సీఈఆర్ వెనుకగల 132/11 కేవీ సబ్స్టేషన్లో ఎలక్ట్రికల్ ఫోర్మెన్గా విధులు నిర్వహించే బత్తుల వెంకటస్వామి బాడీ బిల్డింగ్ (90కేజీల విభాగం) సింగరేణి స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాఽధించారు. ఆదివారం సబ్స్టేషన్ వద్ద సింగరేణి రిటైర్ట్ కార్మిక అసోసియేషన్ సంఘం నాయకులు వెంకటస్వామిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు వాసాల శంకర్, ఉపాధ్యక్షులు నెల్లి వీర య్య, జక్కం రాజన్న, కోశాధికారి ఆసం కొమురయ్య, నాయకులు ఎల్లారం, మధునయ్య, శంకర్, ఖలీల్, రాయలింగు తదితరులున్నారు.


