● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం ● సామగ్రి ధరలు పెరగడమే కారణం ● నిర్మాణాలు ప్రారంభించని ఇళ్ల రద్దు ● అర్హులకు కేటాయించేందుకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం ● సామగ్రి ధరలు పెరగడమే కారణం ● నిర్మాణాలు ప్రారంభించని ఇళ్ల రద్దు ● అర్హులకు కేటాయించేందుకు చర్యలు

Oct 19 2026 2:19 AM | Updated on Oct 19 2026 2:19 AM

● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం ● సామగ్రి ధరలు పెరగడమే కారణం ● నిర్మాణాలు ప్రారంభించని ఇళ్ల రద్దు ● అర్హులకు కేటాయించేందుకు చర్యలు

మంచిర్యాలటౌన్‌: పేదల సొంతింటి కల సాకా రం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిర మ్మ పథకంలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఇళ్ల ని ర్మాణాల్లో జాప్యం జరుగుతోంది. ఇసుక కొరత, నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు ప్రారంభించినా పూర్తి చేసేందుకు ఇబ్బందులు ప డుతున్నారు. మొదటి విడతలో జిల్లాకు 10,282 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 3,056 నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 1,662 ని ర్మాణాలు ప్రారంభించనే లేదు. వీటిని గతంలో దరఖాస్తు చేసుకుని ఇళ్లు మంజూరు కాని అర్హులకు కేటాయించేందుకు అధికారులు కసరత్తు చే స్తున్నారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన వారికి దశలవారీగా ఎప్పటికప్పుడు బిల్లులు ఖాతాల్లో జమ వుతున్నాయి. కానీ, నాలుగు నెలల నుంచి చివరి బిల్లు మంజూరులో జాప్యం జరుగుతోంది.

రెండో విడతలో ఇలా..

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రెండో విడతలో జి ల్లాలోని ఒక్కో నియోజకవర్గానికి 2వేల చొప్పున ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తోంది. ఇందులో 1,500 నూతనంగా ఇంటి నిర్మాణం కోసం కేటా యించగా, 500 ఇళ్లను పాత ఇంటికి రూఫ్‌ (పైకప్పు) మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం రూ.2లక్షలు ప్రభుత్వం ఇవ్వనుంది. దీంతో గతంలో నిర్మించుకున్న వారికి ఇంటి రూ ఫ్‌ మార్చుకునే వీలు కలిగింది. గతంలో రేకులు, గూన ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, ప్రభుత్వం అందించే రూ.2లక్షలతో స్లాబ్‌ వేసుకునే అవకాశముంది. స్లాబ్‌ వేయకున్నా, పాత రూఫ్‌ స్థానంలో కొత్తది వేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించడంతో నిరుపేదలకు పాత ఇంటిని కొత్త ఇంటిగా మార్చుకునే వెసులుబాటు కలగనుంది.

834 మందికి ప్రొసీడింగ్స్‌

రెండో విడతలో అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తికాగా, ఇప్పటివరకు 834 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసి అధికారులు ప్రొసీడింగ్స్‌ అందజేశారు. విడతల వారీగా మిగతా వారికి మంజూరు పత్రాలు అందించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఒక్కో నియోజకవర్గానికి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చేపడుతున్న చర్యలతో సొంత ఇల్లు లేని వారికి లబ్ధి చేకూరనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement