క్యాతనపల్లిలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు | - | Sakshi
Sakshi News home page

క్యాతనపల్లిలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు

Oct 19 2026 2:13 AM | Updated on Oct 19 2026 2:13 AM

● మంత్రి వివేక్‌ వెంకటస్వామి ● సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ప్రారంభం

రామకృష్ణాపూర్‌: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి లో మూడు, నాలుగు నెలల్లో దాదాపు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తికానున్నట్లు రాష్ట్ర కా ర్మికశాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని గద్దెరాగిడి శ్రీనివాసగార్డెన్స్‌ నుంచి ఎంఎన్‌ఆర్‌ గార్డెన్స్‌ వరకు రూ.కోటి 8లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీయూఎఫ్‌ఐడీసీ, డీఎంఎఫ్‌టీ తదితర నిధులతో మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. పెండింగ్‌ పనులు వచ్చే ఏడాదిలోపు పూర్తిచేస్తామని చెప్పారు. రూ.30కోట్లతో చేపట్టిన ‘అమృత్‌’ పనులు ఆరు నెలల్లో పూర్తి చేసి ఇంటింటికీ నల్లా నీరు ఇస్తామని తెలిపారు. మరిన్ని సీఎస్‌ఆర్‌, డీఎంఎఫ్‌టీ నిధులు మంజూరు చేసి మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని వినతి

పాతమంచిర్యాల: అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలు పరిష్కరించాలని అగ్రిగోల్డ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అ ధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు జిల్లా కేంద్రంలో మంత్రి వివేక్‌ వెంకటస్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ జిల్లా కేంద్రంలో అగ్రిగోల్డ్‌ బాండ్‌ల వెరిఫికేషన్‌ ఏర్పాటుకు సీఐడీ డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడతామని హామీ ఇచ్చినట్లు శ్రీనివాసరావు తెలిపారు. అసోసియేషన్‌ సభ్యులు దామరశెట్టి రమేశ్‌, రామడుగు లక్ష్మణ్‌, ఇరుకుల్ల సుధాకర్‌, ప్రవీణ్‌కుమార్‌, సమ్మయ్య, రాజు, మహే శ్‌, సురేశ్‌కుమార్‌, అహ్మద్‌, ముజాహిదిన్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement