ఎకై ్సజ్‌శాఖలో వసూళ్ల పర్వం! | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌శాఖలో వసూళ్ల పర్వం!

Oct 19 2026 2:13 AM | Updated on Oct 19 2026 2:13 AM

● తనిఖీల పేరిట మామూళ్ల దందా! ● దసరా, డిసెంబర్‌ 31న అదనంగా.. ● మద్యం దుకాణాదారుల ఆరోపణ

మంచిర్యాలక్రైం/నస్పూర్‌: ఎక్సైజ్‌ శాఖలో మామూ ళ్ల దందా జోరుగా సాగుతోంది. జిల్లాలోని వైన్స్‌షా పులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు ఒక్కోదానికి రేటు ఫిక్స్‌ చేసి నెలవారీగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. దసరా, డిసెంబర్‌ 31 సందర్భంగా ఎకై ్సజ్‌ శాఖ అధికారులు అదనపు వసూళ్లకు తెరలేపుతున్నారని వైన్స్‌ షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల నిర్వాహకులే బహిరంగంగా చర్చించుకోవడం గమనార్హం. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే దాన్ని అడ్డు పెట్టుకుని నెలనెలా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తనిఖీల పేరిట వేధింపులు

మామూళ్లు ఇవ్వకుంటే లేనిపోని కొర్రీలు పెట్టి కేసులు నమోదు చేస్తారని, తనిఖీలు, నిబంధనల పేరి ట వేధింపులు, బెదిరింపులు తప్పవని వైన్స్‌షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎకై ్సజ్‌ అఽధికారులు అడిగినంతా ఇవ్వాల్సి వస్తోందని వాపోతున్నారు. కాగా, ప్రస్తుతం దసరా పండుగ పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారని వైన్స్‌ షాపుల యజమానులు కొందరు ‘సాక్షి’తో మొరపెట్టుకోవడం గమనార్హం. నెలవారీ మామూళ్లు ఇస్తున్నా కూడా దసరా, డిసెంబర్‌ 31 అంటూ ఒక్కో షాపు నుంచి రూ.16వేల విలువ చేసే వివిధ కంపెనీలకు చెందిన ఎనిమిది మద్యం సీసాలు తీసుకెళ్తున్నారని వాపోయారు.

రెండో నెల నుంచే వసూళ్లు..

జిల్లాలో 73 వైన్స్‌ షాపులు, 15 బార్‌ అండ్‌ రెస్టారెంట్లున్నాయి. మద్యం దుకాణాలను టెండర్‌ ద్వారా దక్కించుకున్న వ్యాపారుల వద్ద రెండో నెల నుంచి మామూళ్ల వసూలు ప్రారంభమవుతుంది. జిల్లాలో నాలుగు ఎకై ్సజ్‌ సర్కిళ్లున్నాయి. ఒక్కో సర్కిల్‌కు ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలున్నారు. సీఐకి అనుకూలంగా, ఎకై ్సజ్‌ శాఖకు నమ్మకంగా ఉండే ఓ కానిస్టేబుల్‌ను వసూళ్ల కోసం నియమించుకుంటున్నట్లు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. సదరు కానిస్టేబుల్‌ మఫ్టీలో వచ్చి తమ వద్ద నెలనెలా వసూలు చేస్తుంటాడని వాపోతున్నారు. ఒక్కో వైన్స్‌షాపు నుంచి నెలలో అమ్మిన మద్యం అమ్మకాలను బట్టి రూ.10వేల నుంచి రూ.15వేల వరకు ఇస్తున్నామని వ్యాపారులు, నెలకు రూ.15వేలు చెల్లిస్తున్నామని బార్‌ అండ్‌ రెస్టారెంట్ల నిర్వాహకులు బహిరంగంగా చెప్పుకోవడం గమనార్హం. ఈ లెక్కన జిల్లాలో 73 వైన్స్‌షాపులు, 15 బార్ల నెలవారీ మామూళ్లు రూ.లక్షల్లో ఉండగా, ఏడాదికి రూ.కోటి దాటుతోంది.

అనుమతుల పేరుతో..

సాధారణ రోజుల్లో మద్యం అమ్మకాలకు నిర్ణీ త సమయం ఉంటుంది. కానీ దసరా, డిసెంబర్‌ 31న ప్రభుత్వం కొంత సమయాన్ని అదనంగా అమ్మకాలు జరుపుకొనే అవకాశం కల్పిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఎకై ్సజ్‌ శాఖ అధికారులు స్పెషల్‌ వసూళ్లకు తెరలేపుతున్నారనే ఆరోపణలున్నాయి. అదనపు సమయం కేటాయింపు, ఎక్కువ ధరలకు అమ్మకాలు జరుపుకొనేందుకు అవకాశమిస్తామని, ఇందుకు ఉన్నతాధికారులు, మీడియావారిని మేనేజ్‌ చేయాలంటూ అదనంగా మద్యంతో పాటు కొంత నగదు రూపంలో వసూలు చేస్తున్నారని నిర్వాహకులు వాపోతున్నారు. పండుగల పేరట అదనపు వసూళ్ల దందాపై జిల్లా ఎకై ్సజ్‌శాఖ అధికారి చాణ క్యను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement