లక్సెట్టిపేట: ఈనెల 18న ‘సాక్షి’లో ‘నిబంధనలు తుస్’ శీర్షి కన ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు ఆది వారం స్పందించారు. పట్ట ణంలో అనుమతులు లేని ప లు పటాకుల దుకాణాల్లోని సామగ్రిని ట్రాక్టర్లో మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. అనుమతులు లేకుండా పటాకుల దుకాణాలు నిర్వహించవద్దని తెలిపారు. పోలీస్స్టేషన్ స మీపంలోని, అంబేడ్కర్ చౌక్, పాత బస్టాండ్ ప్రదేశంలోని పటాకుల దుకాణాలను పరిశీలించారు. అనుమతి లేకుండా అమ్మకాలు చేపట్టొద్దని తెలిపారు. తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ విజయ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


