చెత్త సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు | - | Sakshi
Sakshi News home page

చెత్త సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు

Nov 11 2026 1:19 AM | Updated on Nov 11 2026 1:19 AM

● రైతులకు మున్సిపల్‌ కమిషనర్‌ భరోసా

జడ్చర్ల టౌన్‌: ‘చెత్త ఎక్కడ వేయాలి?’ అనే శీర్షికన మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి మున్సిపల్‌ అధికారులు స్పందించారు. జడ్చర్ల మున్సిపల్‌ కమిషనర్‌ గిరీశ్‌ డంపింగ్‌యార్డును సందర్శించి, అక్కడి రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ఇబ్బందులపై సానుభూతి వ్యక్తం చేశారు. మూడు నుంచి ఐదు నెలల్లో డంపింగ్‌యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. తక్షణ చర్యల్లో భాగంగా హిటాచీ యంత్రాలతో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేయిస్తామని భరోసా ఇచ్చారు. డంపింగ్‌యార్డు నుంచి వెలువడుతున్న పొగ సమస్యపై దృష్టి సారించి, వ్యర్థాలకు నిప్పు పెట్టకుండా అగ్నిమాపక శాఖ సహకారం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు సాక్షిలో వచ్చిన కథనంపై ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కూడా స్పందించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement