బ్రహ్మాండ వేడుకకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మాండ వేడుకకు వేళాయె..

Nov 10 2026 12:55 AM | Updated on Nov 10 2026 12:55 AM

బ్రహ్మోత్సవాలల్లో కార్యక్రమాలు

● 10న మంగళవారం ధ్వజారోహణం, దేవాతహ్వానం, భేరిపూజ, 108 అష్టోతర శతకలశాభిషేకం, స్వామివారి కల్యాణోత్సవం, మహానివేదన, మంగళనిరాజనం సాయంత్రం 6:15 గంటలకు భూ సమేత స్వామివారి మయూర వాహన సేవ.

● 11న బుధవారం ఉదయం హోమ

కార్యక్రమాలు. సాయంత్రం 6:20గంటలకు భూ సమేత స్వామివారి హంసవాహన సేవ.

● 12న గురువారం సాయంత్రం 6:25

గంటలకు శేషవాహన సేవ.

● 13న శుక్రవారం సాయత్రం 6:30 గంటలకు గజవాహన సేవ.

● 14 శనివారం మధ్యాహ్నం స్వర్ణాభరణాలతో ఊరేగింపు అలంకారోత్సవం, రాత్రి 9గంటలకు అశ్వ వాహన సేవ.

● 15న ఆదివారం రాత్రి 10 గంటలకు హనుమద్వాహన సేవ.

● 16న సోమవారం ఉద్దాల ఉత్సవం. రాత్రి 10:45గంటలకు గరుడవాహన సేవ.

● 17న మంగళవారం పుష్పయాగం, ప్రత్యేక పూజలు

● 18న బుధవారం ప్రత్యేక పూజలు

● 25న బుధవారం 9:45 గంటలకు స్వామివారి అలంకరణ ఆభరణాలు తొలగిస్తారు. అనంతరం జాతర ఉత్సవాలు

కొనసాగుతాయి.

చిన్నిచింతకుంట: తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవమైన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు వేళైంది. ఈనెల 10వ తేదీనుంచి అంగరంగా వైభవంగా కొనసాగనున్నాయి. అమావాస్య పాడ్యమిని పురస్కరించుకొని స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏడురోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. వీటితోపాటు జాతర ఉత్సవాలు నెలరోజులపాటు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణ, ఆంద్ర, కర్ణాటక, మహారాష్ట, ఒరిస్సా తదితర రాష్టాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. దాదాపుగా పదిలక్షల మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకోనున్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. దీంతో నెలరోజులపాటు కాంఛన గుహ గోవింద నామస్మరణలతో మార్మోగుతుంది.

బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

స్వామివారి బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రాగణమంతా రంగులు అద్దారు. ఆలయ అర్చకులు స్వామివారు విహరించే వాహన సేవా కార్యక్రమాల వస్తువులను శుద్ధి చేసి సిద్ధం చేసి ఉంచారు. స్వామివారి ప్రధాన ఆలయం, అమ్మవారి ఆలయం, రాజగోపురం తదితర వాటికి విద్యుద్దీపాలతో అలంకరించారు. అక్కడక్కడా హైమాస్ట్‌ లైట్లతోపాటు వీధిదీపాలు ఏర్పాటు చేశారు. విద్యుత్‌ అంతరాయం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర మైదానంలో ఉన్న 4మంచి నీటీ ట్యాంకులు శుభ్రపరిచారు. కొళాయిలు ఏర్పాటు చేసి మంచినీటిని అందించనున్నారు. అంతేకాక 20 జీపీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. జాతర ప్రాగణంలో పారిశుద్ధ్యం లోపించకుండా 300మంది పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తున్నారు. మహిళలకు ఇబ్బందులు కలుగకుండా దాదాపుగా 90 స్నానపుగదులు, మరుగుదొడ్లు నిర్మించి అక్కడక్కడా తాత్కాలిక మొబైల్‌ మూత్రశాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఆలయ ముఖద్వారం నుంచి ఉద్దాలగుండు వరకు భారీకేడ్లు ఏర్పాటు చేసి జాతర ప్రాగణంలో 80సీసీ కెమెరాలు అమర్చారు. అత్యవసర వైద్యసేవలు అందించేందుకు 4వైద్యశిబిరం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

16న ఉద్దాల త్సవం

స్వామివారి ఉద్దాల ఉత్సవం ప్రత్యేక ఘట్టం. చిన్నవడ్డేమాన్‌లో దళితులు వారంపాటు భక్తిశ్రద్ధలతో తయారు చేసిన పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అప్పంపల్లి, తిర్మలాపూర్‌ మీదుగా ఊరేగింపుగా కురుమూర్తి గిరులకు తరలిస్తారు. ఈ ఊరేగింపులో శివసత్తుల ఆటపాటలు, గోవింద నామస్మరణ మార్మోగుతాయి. ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు.

14న అలంకరణ

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన మైన ఘట్టం అలంకారోత్సవం ముక్కెర వంశపురాజులు బహూకరించిన ఆభరణాలను నెలరోజులపాటు స్వామివారికి అలకంకరించడం ఈ ఉత్సవ ప్రత్యేకత వనపర్తి జిల్లా ఆత్మకూర్‌ పటణంలోని ఎస్‌బీఐ లాకర్‌లో భద్ర పరిచిన స్వామివారి బంగారు ఆభరణాలను పోలీస్‌ బందోబస్తు మధ్య కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా అమ్మాపూరం సంస్థానదీసులు రాజ శ్రీరాంబూపాల్‌ ఇంటికి చేరుస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అంబోరు మధ్యన కాలి నడకతో కురుమూర్తి గిరులకు తరలిస్తారు. కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

నేటినుంచి కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు

14న అలంకారోత్సవం

16న ఉద్దాల ఉత్సవం

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement