కొత్తకోట రూరల్: గిరిజన యువకుడు కె.వర్ష బాబునాయక్‌ను వారం క్రితం సీసీ కుంట ఎస్‌ఐ గోకారి కులం పేరుతో దూషించి, అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఎస్‌ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని దిల్‌కుషా భవన్‌లో జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ జాతోట్ హుస్సేన్ నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గిరిజన యువకుడిపై కులం పేరుతో దూషణలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐ కె.గోకారిపై సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన వారిలో గిరిజన నాయకులు ఎస్.గోపానాయక్, ఏ.లక్ష్మణ్ నాయక్, కె.రామునాయక్ , సురేందర్‌నాయక్, త్యాగరాజు, శంకర్ నాయక్, రాజు నాయక్, గోపాల్ నాయక్, శేఖర్ నాయక్, కేటీజీ గోపాల్ నాయక్, జీవీఎస్ రవీందర్ నాయక్ తదితరులు ఉన్నారు.


