మానవ హక్కుల సంఘం పేరుతో బెదిరింపులు | - | Sakshi
Sakshi News home page

మానవ హక్కుల సంఘం పేరుతో బెదిరింపులు

Nov 10 2026 12:55 AM | Updated on Nov 10 2026 12:55 AM

● రూ.50 వేల వసూలు

● ఇద్దరిపై కేసు నమోదు

కొత్తకోట రూరల్‌: జాతీయ మానవ హక్కులు, సామాజిక న్యాయ సంఘానికి చెందిన వారమంటూ ఓ హోటల్‌ యజమానిని బెదిరించి రూ.50 వేలు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులపై కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. కొత్తకోట ఎస్‌ఐ ఎం.విక్రమ్‌ తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన జీటీ రాఘవేందర్‌ యాదవ్‌ గతంలో జీటీ నారాయణ పేరుతో కోచింగ్‌ సెంటర్‌ నిర్వహించేవాడు. ప్రస్తుతం కోచింగ్‌ సెంటర్‌ నిర్వహణలో లేకపోయినప్పటికీ, ఆ కేంద్రం వద్ద జాతీయ మానవ హక్కులు, సామాజిక న్యాయం సంఘం పేరుతో బోర్డు ఏర్పాటు చేసుకున్నాడు. పట్టణంలో టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం గువ్వదిన్నెకు చెందిన అడివేష్‌ వద్దకు ఈ నెల 3న జీటీ రాఘవేందర్‌ యాదవ్‌ దయ్యాల శేఖర్‌తో కలిసి వెళ్లాడు. తాము మానవహక్కుల కమిషన్‌ వచ్చామని నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగించాల్సిన సిలిండర్లకు బదులుగా గృహ అవసరాల సిలిండర్లు వినియోగిస్తున్నారని వ్యాపారికి తెలిపారు. నీపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో భయపడిన వ్యాపారి అడివేష్‌ ఈ నెల 5న రూ.10 వేలను వారికి ఫోనన్‌ పే ద్వారా పంపించగా, మిగిలిన రూ.40 వేలను 6వ తేదీన నగదు రూపంలో అందజేశాడు. తెలిసిన వ్యక్తితో జరిగిన విషయాన్ని చెప్పడంతో వారు మోసగించారని చెప్పడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.విక్రమ్‌ తెలిపాడు. ఇదిలా ఉండగా పట్టణంలోని పలు హోటల్స్‌ యజమానులను కూడా బెదిరించి డబ్బులు ఇవ్వాలంటూ ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. వారు సైతం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్టు విశ్వనీయ సమాచారం. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సంఘాల పేరుతో వచ్చి బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్‌ చేస్తే భయపడకుండా సమీప పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, అలాగే 87126 70621 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement