కురుమూర్తి గుట్టకు తరలివచ్చిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

కురుమూర్తి గుట్టకు తరలివచ్చిన భక్తులు

Nov 10 2026 12:55 AM | Updated on Nov 10 2026 12:55 AM

చిన్నచింతకుంట: పేదల తిరుపతిగా పేరుగాంచిన అమ్మాపురం కురుమూర్తి స్వామి ఆలయానికి అమావాస్యను పురస్కరించుకొని సోమవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలలనుంచి వేలాదిగా తరలి వచ్చి స్వామివారి దర్శనానికి క్యూలైన్లో గంటల తరబడి నిల్చున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు తెల్లవారుజామునుంచే కోనేరులో స్నానాలు ఆచరించి మెట్లపై గోవింద నామస్మరణలు చేస్తూ స్వామిచెంతకు చేరి దర్శించుకున్నారు. కొందరు భక్తులు దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు ప్రత్యేక పూజలు, వ్రతాలు, అభిషేకాలు, గండదీపాలు మోసి మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన స్వామి వారితోపాటు అలివేలు మంగమ్మ, చెన్నేకేశవస్వామి, ఆంజనేయ స్వామి, ఉద్దాల మండపంలో స్వామివారి పాదుకలను దర్శించుకున్నారు. రాజగోపురం వద్ద దీపాలు వెలిగించారు. కురుమూర్తి కొండపైన, జాతర మైదానంలో భక్తల రద్దీ కనిపించింది. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈఓ మదనేశ్వరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ బాల్‌రాజు, కమిటీ సభ్యులు మైపాల్‌రెడ్డి, తిరుపత్‌రెడ్డి, అర్జున్‌ ఏర్పాట్లను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement