ఆత్మకూర్: మెడికల్ దుకాణాల్లో కాలంచెల్లిన మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని వనపర్తి జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ రష్మిక హెచ్చరించారు. ఇటీవల స్థానిక రత్న మెడికల్ స్టోర్‌లో కాలంచెల్లిన మందులు కొనుగోలు చేసి ఓ రోగి తీవ్ర అస్వస్థకు గురయ్యడాడు. దీతో సోమవారం డ్రగ్ ఇన్స్పెక్టర్ రష్మిక అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రత్న మెడికల్‌లో కాలంచెల్లిన మందులు విక్రయించినట్లు గుర్తించామని, మందులను సీజ్‌చేసి ల్యాబ్‌కు పంపిస్తున్నామని పేర్కొన్నారు. రికార్డులు నమోదు చేయలేదని, మందులు విక్రయించి బిల్లులు కూడ ఇవ్వడంలేదని గుర్తించినట్లు వివరించారు.
20 ఏళ్లుగా అద్దె లైసెన్సుతోనే..
స్థానిక రత్న మెడికల్‌షాపు 20 ఏళ్లుగా అనురాధ సంబంధించిన సర్టిఫికేట్‌తో దుకాణం కొనసాగిస్తున్నారు. సంబంధిత మహిళ అనురాధను పిలిపించగా అద్దెకు ఇచ్చిన విషయం వాస్తవమేనని తన సర్టిఫికేట్ తిరిగి తీసుకున్నట్లు వివరించారు. 20 ఏళ్లుగా ఫార్మసిస్టు లేకుండానే అద్దె సర్టిఫికేట్‌తో మెడికల్‌షాపును నడుపుతున్నారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేసి అధికారులు దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణంలోని పలు మెడికల్ షాపులు మూసివేయడంతో పలు అనుమానాలు రేకేత్తిస్తున్నాయి.


