మహబూబ్‌నగర్ క్రీడలు: మధ్యప్రదేశ్ రాష్ట్రం నర్సింగ్‌పూర్‌లో ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు జరిగే 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు తెలంగాణ రాష్ట్ర బాలుర జట్టు సోమవారం తరలివెళ్లింది. రాష్ట్ర జట్టును జిల్లా ఎస్‌జీఎఫ్ (అండర్–19) కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ అభినందించారు. జాతీయస్థాయి క్రికెట్ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ చాటి విజేతగా నిలిచి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోచ్ అబ్దుల్లా బిన్ అహ్మద్, మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, బాల్‌రాజు, శ్రీనివాస్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


