మరో అవకాశం | - | Sakshi
Sakshi News home page

మరో అవకాశం

Nov 10 2026 12:49 AM | Updated on Nov 10 2026 12:49 AM

అచ్చంపేట: ఓటరు జాబితాలో పేరు గల్లంతైనవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్‌)–2026లో భాగంగా ముసాయిదా జాబితా నుంచి పేర్లు తొలగిన వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఆబ్సెంట్‌, షిఫ్టెడ్‌, డెడ్‌, డూప్లికేట్‌ కేటగిరీల్లో నమోదైనవారిలో అర్హులు తిరిగి ఓటరు జాబితాలో చోటు దక్కించుకోవచ్చు. ఇందుకోసం ఈ నెల 21 వరకు సంబంధిత పత్రాలు సమర్పించేందుకు గడువు ఇచ్చింది.

ఉమ్మడి జిల్లాలో 4.63 లక్షల మంది

గత ఆగస్టు 17న విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 4,63,155 మంది ఏఎస్‌డీడీ కేటగిరీలో ఉన్నారు. వీరిలో 2,41,883 మంది చిరునామా మారినవారు, 88,198 మంది మరణించినట్లు నమోదైనవారు, 50,828 మంది గైర్హాజరైనవారు ఉన్నారు. ఇతర కేటగిరీల్లోనూ పేర్లు తొలగినవారున్నారు.

ఫారం–8 అవసరం లేదు

చిరునామా మారినవారు తిరిగి నమోదు చేసుకునేందుకు ఫారం–8 సమర్పించాల్సిన అవసరం లేదు. కొత్త చిరునామాకు సంబంధించిన ఆధారాలను ఎన్యుమరేషన్‌ ఫారంలో జతచేస్తే సరిపోతుంది. ఇప్పటికే ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ ఎన్యుమరేషన్‌ ఫారం ఇవ్వాల్సిన పనిలేదు. కొత్త చిరునామా, సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ వివరాలను స్పష్టంగా పేర్కొనాలి.

అధికారులను సంప్రదించాలి

ముసాయిదా జాబితాలో పేరు లేనివారు సంబంధిత బూత్‌ లెవెల్‌ అధికారి, ఎన్నికల నమోదు అధికారి లేదా సహాయ ఎన్నికల నమోదు అధికారిని సంప్రదించాలి. అవసరమైన పత్రాలు, చిరునామా ఆధారాలు సమర్పించి ఓటరు జాబితాలో పేరు పునరుద్ధరించుకోవచ్చు.

ఓటరు జాబితాలో పేరు గల్లంతైన వారికి ఈసీ వెసులుబాటు

చిరునామా మారిన వారికీ తిరిగి నమోదుకు అవకాశం

ఈ నెల 21 వరకు దరఖాస్తుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement