మ్యూజియంలోని తేలియాడే బంతి ప్రయోగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బటన్ నొక్కగానే గాలి ప్రవాహం కారణంగా బంతి గాలిలో తేలియాడుతూ కనిపిస్తుంది. గాలి వేగం, పీడనాల మధ్య సంబంధాన్ని వివరించే బెర్నౌలీ సూత్రం ఆధారంగా ఈ ప్రయోగం పనిచేస్తుందని కోస్గి ప్రభుత్వ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని ఎం.పల్లవి ముఖ్యమంత్రికి వివరించారు. విమానం రెక్కలపై గాలి ప్రవాహం వల్ల ఏర్పడే ఉత్థాపక బలాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఈ సూత్రం ఉపయోగపడుతుందని తెలిపింది. పాఠ్యపుస్తకాల్లో చదివే సూత్రాలను ఇలాంటి ప్రయోగాల ద్వారా ప్రత్యక్షంగా అర్థం చేసుకోవచ్చని వివరించింది. విద్యార్థులు ప్రయోగాలను కేవలం ప్రదర్శించడమే కాకుండా వాటి వెనుక ఉన్న శాసీ్త్రయ కారణాలను కూడా వివరించడం విశేషం.


