గిరిజనుల హామీలు నెరవేర్చాలి | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల హామీలు నెరవేర్చాలి

Nov 2 2026 12:35 AM | Updated on Nov 2 2026 12:35 AM

కల్వకుర్తి రూరల్‌: ఎన్నికల సమయంలో చేవెళ్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సేవాలాల్‌ సేన ఆధ్వర్యంలో గిరిజన గళం తండాలో నిద్ర కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్‌ నాయక్‌, రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్‌ నాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం ఆదివారం కల్వకుర్తిలో చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని శివాజీ చౌక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎడ్మ సత్యం తదితరులు హాజరై గిరిజనులకు మద్దతు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ప్రతి కులానికి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ తర్వాత హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు, గిరిజనులు గుణపాఠం చెప్పాలని గోలి శ్రీనివాసరెడ్డి, ఎడ్మ సత్యం పిలుపునిచ్చారు. గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏ ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలన్నారు. మైదాన ప్రాంతాల గిరిజనులకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలని, మంత్రివర్గంతోపాటు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులలో గిరిజనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సంజీవ్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ రామునాయక్‌, విజయ్‌గౌడ్‌, దేవిలాల్‌ చౌహాన్‌, గుండ్యా నాయక్‌, గిరిజనులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement